ఈ పుటను అచ్చుదిద్దలేదు
106

గోపదంపతులు.

    అప్ప--(నొచ్చుకొని) అయ్యా! అటులేని క్షమింపుడు. నేనీవియోగదు:ఖమును శాంతచిత్తముతో ననుభవింతును. పూర్వజన్మమున నే నేదంపతులనో విడదీసితిని. ఇప్పుడు దానికి బ్రతిఫల మనుభవింపక తప్పదు. నాగృహమందలి యీదుశ్చరిత మొరులతో జెప్పికొనుటయు దగదు. నేనీపురికి నీవియోగదు:ఖ మనుభవించుటకే వచ్చితిని. (అని కంట దడిపెట్టును.)
     రామయ్య యాఱితేరిన దుష్టుడు. వానికేమియు జాలికలుగలేదు. అప్పలసామి భుజముమీద దట్టును. లేవనెత్తి మరల నతని బండిలో గూర్చుండబెట్టుకొని యతడు బయలుదేఱి దారిలో సామిపిళ్ళను వానిబవకడ విడిచి తాను మిత్రబృందముతో గూడి పల్లవరమునకు బోయెను.
     అప్పలసామి నాల్గుదినములవఱకు బయటికి రాకుండ నింటిలోనే కూర్చుండి దు:ఖించుచుండెను. సర్కసుకంపనీవారు సామిపిళ్ళకేకాక తమకుగూడ గొప్పనష్టము సంభవించినదని చెప్పి యతనిని బలువితముల నూరార్చి, మఱియొక స్ద్త్రీ గంగా బాయి స్ధానములో, బనిజేయుటకు దొరకునేమో యని ప్రయత్నము చేయుచుండిరి. ఈపని జరిగ్నతరువాత  నొకనెలదాక సర్కసే పడలేదు. సామిపిళ్ళకు మునుపటి చుఱుకుదనమే పోయెను. పిచ్చివానివలె నతడు కనబడుచుండె. అతడింతకమున్ను సంపాదించుకొన్న మొత్తమైదువేలుగలదు. దానినతడు 'బ్యాంకు 'లో వేసికొని యుండెను. అతడు ప్రతి