ఈ పుటను అచ్చుదిద్దలేదు

103

నూత్నజీవనము.

నామెకన్నీటిని దుడిచి యామె నక్కునజేర్చి ముద్దాడి లాలించెను. ఈమాటలచేతను, లాలనములచేతను, మరల నామె పశ్చాత్తాపము పలాయనమొందెను. మనస్సు కుదురుపఱచుకొనెను. నూత్నధవునివంక సానురాగముగ వీక్షించెను. అతడు మరల జుంబనమొర్చి బుజ్జగింపగా వానికి బూర్తిగా వశమై పోయెను.

   నాటగోలె నామె యందే నివసించుచు రామయ్య తొ గాపురము చేయుచుండెన్యు. రామయ్య తా నే యపరాధ మెఱుగనివానివలె నటించుటకు మఱునాడు కొంతసేపు వై.యం. సీ. యే భవనములోనికివచ్చి కూరుచుండి సోదరునితొ నేదోప్రసంగము జరప యెగెను. ఆనాడప్పలసామి బసకు రాలేదు. అతడా సాయంకాలమున 'కాస్మోపోలిటన్ క్లబ్బు ' లో రామయ్యను గలసికొనెను. రామయ్యను జూచిన తోడనే సభ్యులలో గుసగుసలు బయలువెడలెను. కాని యతడెప్పటి వలెనే యుండెను. అప్పలసామి కొంతసేపు రామయ్య వంక గోరచూపులు చూచి, యవల 'నయ్యా! మీతో గొంతమాటాడవలెను. అవకాశమిత్తురా?" యని యడిగను. రామయ్య ప్రహర్షసూచకవదనముతో, "ప్రొఫెసర్! మీకవకాశమీయనా? ఎందువిషయమై నాతోమాటాడ గోరుచున్నారు? ఎప్పుడు? ఎక్కడ?" అని యాత్రముతో నడిగెను. వారు సంభాషించుకొనుట చూచి మరల మర్మరద్వనులు బయలుదేఱినవి. రహస్యమనిచెప్పి సామిపిళ్ల వాని గొంతు