ఈ పుటను అచ్చుదిద్దలేదు
102

గోపదంపతులు.

యిందుంచిరేమోయనునట్టి శృంగారముతో దన్మందిర ముండెను.

     గంగాబాయికి దనచేయందిచ్చి రామయ్య మోటారు నుండి దింపెను. చేసినది మహాదోషకార్య మగుటచేతను, సెట్టికృత్యములకామె యింతకు ముందలవడి యుండకపోవుట చేతను, నామె తనులత కంపింప శకటమవరోహించి ప్రియుడు దారిజూప లోనికేగెను. హృదయావేగము క్రమక్రమముగా బెంపగుటచేత నామె యొక కురిచీలో గూలబడి వెక్కి వెక్కి యేడువసాగెను. "గంగాబాయి! నేను నీకై సర్వము ధారపోయుచుండ నీకేల యీదు:ఖము? ఈ రతీవిలాసము నీది. నేను నీదాసుడను. నీవెట్టి యపురూపవస్తువు గోరినను నుత్తరక్షణమున నీకు దెచ్చియిచ్చుటకు దాసదాసీజనులను బెక్కండ్రను నియమించియున్నాను. నీవిందున్న పాలాక్షుడైన నిన్ను గనుగొనలేడు. నీవు బయటికి బొవనుంకింతు వేని యిరులకంట బడకుండ 'ఘోషాకార్ ' లో నిన్ను గొనిపోవునేర్పాటు గావించియున్నాను. నీమగడుగాని యతని మిత్రులుగాని నిన్నన్వేషింపయత్నించినను లాభముండదు. కొంతకాలమిట్లు రహస్యముగా నుందువేని, పిమ్మట నీవు బాహాటముగా బయటికి రావచ్చును. ఓకవేళ నితరులు నిన్ను జూచినను నీకేమిభయము? ;నాయిష్టము ' నేనుజెట్టిగారిని వరించి వచ్చితి ; ననుము. ప్రకృతమునమాత్రము గుప్తజీవనమొనర్చు" మని యామెను సమీపించి తన చేరుమాలుతొ