ఈ పుటను అచ్చుదిద్దలేదు

101

నూత్నజీవనము.

కుసుమవిరహితములై చిత్రవర్ణ శోభితవస్త్రములతో బ్రకాశించునవై మట్టికుండ్లయం దమర్చబడియున్న పశ్చిమదేశపు మొక్కలు గలవు. అవియెల్ల నంతస్తులుగ నమరింపబడి యుండెను. శైవాలజాతిలో జేరిన కొన్ని చిట్టిమొలకలు 'భూలోకస్వర్గమునకు స్వాగత ' మను నర్దమిచ్చు నాంగ్లపదామ్నాయము వలె నాటబడియుండెను. సింహద్వారమునుండి భవనముదాక దిన్నని బాటయు దానికిరుప్రక్కల సమొన్నతములగు తరురాజములును గలవు. పుష్ప వనమునందు జొచ్చుటకు జిఱుతబాటలును గలవు. మందిరమునకు వెనుకటితట్టున వివిధఫలవృక్షములు బారులుతీర్చి నాటబడియుండెను. అందును విశ్రామవేదికలును వానిపై లతాచ్చాదనములును బెక్కులు నిర్మింపబడి యుండెను.

    భవనమునందలి గోడలన్నియు క్షీరోపలములచే గూర్పబడెను. నేలరంగురంగుల  స్నిగ్దములచే నలంకరింపబడెను. ఇంటికప్పునకు వేసిన బల్లకూర్పు, దానియందు జేయబడిన నగషీపనులు మిగులజోద్యములుగ నుండెను. ఆమందిరమందు నిలుపబడియున్న పర్యంకములు, తల్పములు, చిత్రవిచిత్రాసనములు, మున్నగువస్తుజాలమంతయు జాలవిలువ గలదై కన్నులకింపగు కాంతులగ్రక్కు చుండెను. సౌందర్యము, లావణ్యము, విలాసము, మొదలగునవెల్ల ముద్దగాజేసి