ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

పలాయనము.

అతనియెడలు నిలువున నీరై యతడొక్కసారి కూలబడి పోయెను. ద్వారరక్షకులువచ్చి యతనిబట్టుకొని లేవనెత్తిలోనికిగొనిపోయిరి. అత డాడుదానికన్నను మిన్నగ నొకమూల గూర్చుండి రోదనము చేయదొడంగెను. కారణమేమని యడుగ నతడెవ్వరికి మారుపల్కడయ్యె. యజమానులు గంగాబాయిని బిలిచి యడుగుదమన్న నామె కన్ఫట్టకుండెను. వారికి బూర్వవృత్తాంతము మెమియు దెలియదు. నేమితలచుటకును బాలుపోకుండెను. ప్రేక్షకులలో గొందఱు గోపదంపతుల ప్రదర్శనములందెక్కు డభిరుచిని సూచించుచు వారిని దఱుచుగా బహుకరించుచు వారిబసకెదుటనే తామును బసకుదుర్చుకొనియున్న చెట్టియార్ల వైఖరి కనిపట్టి యిప్పుడు జరిగినదెల్ల నూహింపగల్గిరి. చెట్టియార్ల వలెనే గంగాబాయి మీద గన్నువైచిన యువకులు కొందఱును నెవడో యామెను లంకించుకొని పోయెనని గ్రహింపగలిగిరి. ఆనోట నానోట నీవార్త ప్రేక్షకులలో నెల్ల వ్యాపించెను. వారినుండి నిన్న సర్కసుయజమానులును నివ్వెఱ పడి చూచుచుందిరి.

  సర్కసు నిలిపివేయబడెను. జరిగిన వృత్తాంతముం గూర్చి పౌరులు పలుతెఱంగుల జెప్పించుకొనుచు బసలకేగిరి. సకలవిషయాన్వేషణ తత్పరులు కొందఱం దేయుండి సర్కసు  వారి నేవేవొ ప్రశ్నలువైచుచుండ, శంభులింగముపిల్లిగారీలివకివచ్చి వారికేదో సమాధానము చెప్పి వారిని వదల్చుకొనిరి. దు:ఖ ప్రవాహము కొంత యాగినతర్వాత నప్పలసామి