ఈ పుటను అచ్చుదిద్దలేదు
96

గోపదంపతులు.

చుండెను. మీసములు దువ్వుచుం దల పంకించు చుండెను. అత్తరువాసనచే శోభించు జేబురుమాలు మాటిమాటికి బయటిదీసి వాసనజూచి జేబులో బెట్టుకొనుచుండెను.తఱుచుగా జేబుగడియారముం దీసి గంటలెన్నియయ్యెనో యనిపరించుచుండెను. అంతెగాని ప్రదర్శనాకౌశలమేమియు బరిశీలింపడయ్యెను. అతని యాందోళనము గంగమ్మ కనిపెట్టేను. మొదటివాని కర్దము గ్రహింప లేకపోయెను. అవ్వల గులాబీపూవు మాట జ్ఙప్తికిరాగా, నతని మనోవైకల్యమునకు హేతువూహించెను.

      పిమ్మట గంగాబాయి యొక్కతియే కొన్ని 'ఫీట్సు ' చేయవలసి యుండెను. ఆమె తనగదిలోకేగి యందు బల్లపై నలంకరింపబడియున్న గులాబీపువ్వులలో నొకదాని నూడబెఱికి, దానిని వక్షోమధ్యంబున ధరించి రంగస్దలంబున కవతరించెను. ఆమెను జూచిన తొడనే రామయ్య నటేశము గారులు కరతాళధ్వనులు చేసిరి. గొప్పవారు చప్పటులు గొట్టినప్పుడు మనమూరకుండరాదని యెంచి తక్కుంగల గతానుగతికులగు లోకులు కరతాళద్వనులు గావించిరి. ఆమె యప్పుడు ధరించిన విలువలుగల చెలువంముని గాంచి చెట్టియారులప్పుడు  చప్ప

టులు గొట్టిరని జనులూహించిరి. గొప్పవారు చేయు ప్రతిస్వల్పకార్యమున కేదో మహత్తరార్దమును గొలది వారు కల్పించి వారిననుసరించుట లోకసామాన్య మే కదా!