పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/8

ఈ పుట ఆమోదించబడ్డది

3

అభినందార్హమైన గ్రంధం రామకృష్ణారెడ్డి థీసిస్

శ్రీ పడాల రామకృష్ణారెడ్దిగారు ఆచార్య యస్.వి.జోగారావుగారి వంటి బహుముఖ ప్రజ్ఞాధురీణుల పర్యవేక్షణలో సాగించిన ఈ పరిశోధన చరిత్రలో నిల్చిపోతుంది. ఈ సిద్ధాంతగ్రంధంలోని ఈ క్రింది అంశాలు ప్రస్తుతించదగినవిగా పేర్కొనాలి.

ఎన్నుకొన్న విషయం పండితులకు, సాధరణ పాఠకులకు ఉత్సుకతను, అభిరుచిని కలిగిస్తోంది. అంశాలన్నీ అందరికీ అందికలోఉండి మనసును రంజింపచేస్తున్నాయి. ఎన్నుకున్న విషయాన్ని విభజించిన తీరు ఎంతోబాగుంది. విషయవిశ్లేషణ ప్రశంసనీయం. "జానపదుల నిసర్గ విజ్ఞాననిధి" అనే అధ్యాయంలో చర్చించిన వివిధఅంశాలు విజ్ఞానదాయకంగా విషయవివణాత్మకంగా ఉన్నాయి. అదేవిధంగా 8,9,10 అధ్యాయాలు అభిరుచిని ప్రేరేపిస్తున్నాయి. విషయసేకరణలో శ్రమ, దీక్ష కన్పిస్తునాయి. విషయానికి తగిన సులభ సుందరమైన భాషలో వ్రాయటం జరిగింది. మొదలుపెట్టిందిలగాయతు చివరివరకు విడిచిపెట్టకుండా ఎంతోఉత్సుకతతోచదివిస్తున్న ఉత్తమమైన పరిశోధన గ్రంధం. రచయితకు నా అభినందనలు.

—ప్రొఫెసర్, డా.మద్దూరిసుబ్బారెడ్డి M. A. Phd.

శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ - తిరుపతి.


ఆలోచనకు ప్రేరణ కలిగించే వ్యక్తి

రా మ కృ ష్ణా రె డ్డి

నాటకకర్తగా, అనేక జానపద కళారూపాల రచయితగా శ్రీ పడాల రామకృష్ణారెడ్డి సుప్రసిద్ధుడు. రచనతోపాటు నటనలోకూడా సముచిత ప్రావీణ్యం ఉండడంవల్ల ఆయననాటకాలు మరింతరక్తికట్టాయి. ఆలోచనకు ప్రేరణకలిగించేవ్యక్తి. తెలుగు జానపద కళారంగంలోని అన్ని అంగాలగురించి (రంగాలగురించి), అంశాలనుగురించి రసవత్తరమైన శైలిలో వ్రాశారు. తెలుగువారికే తెలియని కొన్ని జానపదకళలగురించి ఆటపాటలగురించి వీరు వ్రాసినగ్రంధం యీ రంగంలోఎత్తిన మరో మణిదీపం.