శ కు నా లు
జానపదులు ఎక్కడికైనా ప్రయాణం బయలుదేతి వెళ్ళేటప్పుడు ఒంటిబ్రాహ్మణుడు, పిచ్చివాడు, గుడ్డివాడు, కురూపి, పొదితో మంగలి మురికిబట్టలమూటతో చాకలి, తెలుకల మనిషి, గర్భిణీస్త్రీ, విదవరాలు, తల విరబోసుకున్న స్త్రీ, తోళ్ళు, బొగ్గులు, ఉప్పు, నూనె, నువ్వులు, మినుములు, దూది, కట్టెలు, కొత్తకుండ, ఊక, మలం, మజ్జిగ, ఇనుము, పిడకలు, పిల్లి, పంది ఎదురొస్తే దుశ్శకునములుగా భావిస్తారు. దీనికి ప్రాయశ్చితంగా ప్రయాణం ముందుకు మాని వనక్కి వచ్చి కాళ్ళూచేతులూ, ముఖమూ కడుక్కొని కాసేపు కూర్చుని అప్పుడు ప్రయాణం బయలుదేరతారు.
ఈ శకునాలు ఏడడుగులలోపులో వస్తేనే వర్తిస్తాయనేది ఒక సవరణ కూడా వుంది.
ఇక ఇద్దరు బ్రాహ్మణులు, పుణ్యస్త్రీ, వేశ్య, ఉతికిన బట్టలమూటతో చాకలి, నీరు, పాలు, పెరుగు, నెయ్యి, పువ్వులు, పండ్లు,మాంసం, శంఖం, మంగళారవం, శవం, ఆవుపేడ, ఆవు, గుర్రం, ఏనుగు పుస్తకాలతో విదార్ధి ఎదురొస్తే సుశకునములుగా భావిస్తారు.
బ ల్లి ప త నం
బల్లి చాలా కంగారు కీటకం. ఇళ్ళల్లో అస్తమానూ గోడలమీద్ పురుగుల వేటలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అటూ యిటూ తిరగడంలో అప్రయత్నంగా మనిషిమీద పడుతుంది. బల్లి కొన్ని అవయవాలమీద పడితే కీడు, కొన్ని అవయవాలమీద పడితే మేలు కలుగుతుందని జానపదులు అనాదిగా విశ్వస్తున్నారు. ఫలితాలు యిలాగుంటాఅట.
కీ డు లు:- నడినెత్తిమెద - రోగం
ముంగురులమీద - హాని
జడమీద, తల ముసుగుమీద - వైధవ్యం
చెవిమీద - దుర్వార్తవినుట