ఖాళి చేంబు పై పెడతాడు. రెండు నిమిషాలకు ఆ చేంబునుండి ఝమ్ అని శబ్దం వస్థుంది. దానితో అతను మనకు తేలియని పిశాచి బాషలో మాట్లాడతాడు. తరువాత మాట్లాడిన విషయం మనకు చెబుతాడు. కొంతమందికి అది ఛేతబడికాదని సమాధానమొచ్చిందని, ఎక్కడో జడుసుకున్నాడని, అక్కడ ఒక పిశాచి వెంబడించిందని చెప్పి దానిని వదిలించడానికి పదిరూపాయలు తీసుకొని వేరుముక్క కట్టి పంపించేస్తాడు. కొందరికి చేతబడి ప్రయోగం జరిగిందని దానిని తీయడానికి డబ్బు మాటాడుకొని అమావాస్య అర్ధరాత్రి అతనిని రమ్మని, శ్మశానంలో త్రవ్వించి, ఆ ప్రయోగం చేసిన బొమ్మని పైకితీయిస్తాడు. ఆ ప్రయోగం చేసినవాళ్ళనిమాత్రం చెప్పడు. అది ఆ రోగి, ఆరోగి బందువులు ఊహించుకోవలసిందే. శతృవులెవ్వరో. ఇలా తీసేసిన తరువాత అతనికి ఆజబ్బు నయమయిపోతుంది. ఆశ్చర్యం: చేతంబడులనేవి అసలు లేనేలేవని అనేవారు దీనికి చెప్పేదేమిటంటే రోగి తనను కలిసాక ఆతంత్ర్రగాడే ఒక బొమ్మనుచేసి, దానికి వెంట్రుకలు చుట్టి, ముళ్ళుగుచ్చి ఒక స్మశానంలో ఒకచోట పాతిపెట్టి వచ్చి, ఆతరువాత అమావాస్యనాదు అర్ధరాత్రి అతనిని అక్కడకు తీసుకెళ్ళి త్రవించి దానిని తీయిస్తాడని. మరి రోగమెలా తగ్గుతుందయ్యా అంటే ఇది సైకలాజికల్ ట్రీట్ మెంటని అంటారు. పచ్చని చెట్లకు కూడా ఈ ప్రయోగం చేస్తే ఆ చెట్లు ఆకులు రాల్చి మాడిపోయి చచ్చిపోతాయని జానపదులు చెబుతుంటారు. ఈ జిల్లాలోనే లొల్లలోనూ, నడిశలేరులోనూ, కోనసీమలోను ఈ చేతబడులు తీసేవారు ఉన్నారు. ఇలాంటి చెడుపు, చిల్లంగి అనేవికూడ.
గృ హ వా స్తు
జానపదులు యిండ్లు నిర్మాణంలో యీ క్రింది నియమాలు పాటిస్తారు. ఆగ్నేయం పెరకం (పెరిగి) ఉండ కూడదట - అలా ఉంటే ఆ యింటిలో వారికి దరిద్రమట.
దక్షిణం, పడంర మెరకగా ఉండాలి- తూర్పు, ఉత్తరం పల్లంగా ఉండాలి- అలా ఉంటే ఆ యింటిలోని వారు వృద్ధి పొందుతారు. ఆగ్నేయంలో పొయ్యి, ఈశాన్యంలో నుయ్యి, ఉండాలంటారు - అలా ఉంటే శుభం. సింహద్వారానికి ఎదురుగా నుయ్యిగాని, గొయ్యిగాని