పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/75

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్నగారు తమ్ముణ్ణి ప్రశ్నిస్తే జరుగుతున్న వ్యవహారం చెప్పాడు. రాత్రి తమ్ముని వెళ్ళకుండాఆపుచేస్తే అర్ధరాత్రి ఆమెవచ్చి తలుపుకొట్టిందని అన్నగారు లేచివచ్చి తన మంత్రశక్తితో ఆమెను నిజరూపంలోకి మారిస్తే ఆమె కామపిశాచి అని తేలింది. వెంటనే ఆ భూతాన్ని తరిమికొట్టాడట. అలాగ తమ్ముని రక్షించుకోగలిగాడనీ, లేకుంటే మరో పదిరోగులకి అదె రాక్షస రతిమూలంగా అతను చచ్చిపోయి ఉండేవాడని చెప్పుకుంటారు (కాశీమజిలీ కధల మాదిరి సుబ్బన్నదీక్షితకవి-గొల్లభామ కధల్లంటివి ఇలాంటి వానిని వినే వ్రాస్తుంటారు). దయ్యం పట్టుకున్న వాళ్ళనుంచి దయ్యాల్ని వదిలించడానికి భూతవైద్యులు పేకబెత్తంతో దయ్యం పట్టిన మనిషిని కొట్టడం, అతని తలవెంట్రుక నొకదాన్నితీసి సీసాలో పెట్టి సీసామూత బిరడాతో బిగించి లోపలిగాలి బయటకు రాకుండాచేసి ఊరికిదూరంగా భూమిలో పాతిపెట్టడం చేస్తారు. అంటే ఆభూతం భూస్థాపితంఅయిపోయి బయటకి రాలేదన్నమాట. ఈ భూతాన్నే గాలిపట్టడం అంటారు - గాలిలా దీనికి కూడా రూపం లేనందువల్లనేమో! దయ్యాల మూతులు ఎర్రగా ఉంటాయని, పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయని ప్రతీతి. జానపదులు ఈ భూతాల తృప్తికోసం బలులు ఇస్తుంటారు. రైతులు పంటకొసేముందు కోడిని కోసి ఆ రక్తం అన్నంలో కలిపి మూడుముద్దలు చేలో వేసి భూత శాంతి ఛేస్తారు. కొన్ని ఊళ్ళల్లో గ్రామస్థులంతా షకారంగా ఊరుమ్మడి డబ్బుతో మేకను కోసి అమ్మవారి గుడిముందు తలనరికి ఆ రక్తం అన్నంలో కలిపి ఆ ముద్దలు ఆకుల్లో వేసి తీఉకెళ్ళి తమ తమ పొలాల్లోచల్లి కోత ప్రారంభిస్తారు. దీనినే పంటదేవత జాతర అంటారు.

ఇంతకీ శాస్త్రవేత్తలు కొరివిదయ్యాల గురించి చెఫ్ఫే సిద్ధాంతం వేరు. చనిపోయినవారి ఎముకలలోని భస్వరం గాలిలో కలిసినప్పుడు మండుతూ గాలివాటాన్ని బట్టి అటూ ఇటూ కదులాడుతుంటుందట. అందుకే అని ఎక్కువ శ్మశానాలోను ఆ పరిసర ప్రాంతాలలోనే కనిపిస్తాయి. ఇక భూతావేశాన్ని గురించి వారు చెప్పేది ఇది మానసికమైన ఓక రుగ్మత అనీ, భూతాలతొ సంచరించామనే మాటలు కట్తుకధలనీను.