పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/69

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూజిస్తూ, తొమ్మిది ముడులుగల రెండు తోరాలు అమ్మవారివద్దవుంచి 'బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం, శుభప్రదం పుత్రపౌత్రాణ్భివృద్ధ్యంతబేహిరమే ' అని తోరపూజచేసి ఒక తోరంతీసి కుడిచేతికి కట్టుకుంటారు. తరువాత నానావిధభక్ష్య భొజనముల నివేదన చేసి ముమ్మారు ప్రదిక్షిణ చేస్తారు.

దీనికి కూడా ఒక కధవుంది. ఈ కధ చెప్పే ముందు అందరికీ అక్షతలు యిస్తారు. కధానంతరం అందరూ అవి దేవి మీద చల్లి తమ తలలమీద చల్లుకుంటారు. పూజానంతరం పురోహితుని గంధపుష్పాక్షతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి, దక్షిణ తాంబూలదులతో సత్కరించి నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. ఆ తరువాత ప్రసాదం అందరికీ పంచిపెడతారు. ఈ వ్రతంకూడా సూతుడు శౌకాది మునులకు చెప్పిందే. ఒకనాడు పార్వతీదేవి ఏంచేస్తే స్త్రీల పుత్రపౌత్రాది సంపత్తితో సర్వసౌఖ్యూలూ కలిగి సుఖంగా ఉంటారో చెప్పమంటే పరమేశ్వరుడు యీవ్రతం చెప్పేడట. మగధదేశంలో కుండిన మహానగరంలో చారుమతి అనే బ్రాహ్మణస్త్రీ వుంది. ఆమె మహా పతివ్రత; ఆమెయందు లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కలలో కనిపించి శ్రావణశుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను పూజిస్తే కోరిన వరాలిస్తానని చెప్పిందట. ఆరోజురానేవచ్చింది. ఆమె బంధుమిత్రులతో వరలక్ష్మీదేవిని పూజించి, తొలి ప్రదక్థిణ చేసేసరికి వారికాళ్ళల్లో మువ్వల రవళి వినిపించిందట. చూసుకుంటే కాళ్ళకు బంగారు గజ్జెలు; రెండవప్రదక్షిణ చేసేసరికి చేతులకు నవరత్న ఖచితమైన ఆబరణాలువచ్చాయట, మూడవ ప్రదక్షిణ అయ్యేసరికి అందరూ సర్వభూషణాలకృతులయ్యారట. ఈ వ్రతాలు చేసే వాళ్ళకేగాక విన్నవారికీ, చదివిన వారికీ కూడా యిష్టకామ్యములు సిద్దిస్తాయని ఆఖరున ఫలశృతి చెప్పబడుతుంది ఇలాంటిదే యిష్టకామ్యార్ధసిద్ది కోసంచేసే మరోక వ్రతం 'వినాయక వ్రత్రం '.

వీనిలో ముణ్యంపురుషార్ధాల మాట ఎలావున్నా అత్యూల్పమైన ఖర్చుతో బంధుమిత్రుల సమాగమం, తన్మూలంగా సమాజంలో సమత, మమత, అనురాగం, అభిమానం అభివృద్ది జరిగే అవకాశముంది. పైగా