పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తమ అనుభవాలవల్ల తమకు అందిన సంస్కారంతో ఎన్నో శారీరక, సాంఘిక, మానసిక సమస్యలకు పరిష్కారాలు కనుగొని తరతరాలుగా తమకు ఎదురౌతున్న ఇక్కట్లను ఎదుర్కొంటుంటారు"

7. కులాలు

జానపదులలో కులాలు ఉన్నాయి గాని కులవైషమ్యం మాత్రం తక్కువ. కుల కట్టుబాట్లు, అచారాలు ఎవరికి వారివి వేరుగా ఉంటాయి. పెద్దకులాలలో పతివ్రత్యం విధిగా పాటించాలి. పరపురుషసాంగత్యం భార్యను భర్త విడిపెట్టేదాకా పోతుంది. భర్త చనిపోతే ఆమె విధవరాలుగా జీవితాంతం బ్రతకవలసిందే. వ్యభిచార నేరానికి సంఘంలో వెలివేయడం కూడాకద్దు. ఇక మగాడిసంగతికి వస్తే ఏకపత్నీవ్రతం ప్రశంసనీయం - పిల్లలు పుట్టనప్పుడు బహుపత్నీ వ్రతం నిషెధ్జం కాదు. ఒక కాలంలో ఉంపుడుకత్తెలను ఉంచుకోవడం ఆ వ్యక్తి గొప్పతనానికి నిదర్శనంగా ఉండేది. కొన్ని కులాలలో భార్యాభర్తలకు సరిపడకుంటే పెద్దలు విచారణచేసి కులతప్పులు వేసి విడాకులు ఇప్పిస్తారు. వారు పునర్వివాహం చేసుకోవడాన్కి అనుమతిస్తారు. కొన్ని కులాలలో స్త్రీలు అలా ఏడు మనువులు వరకూ వెళ్ళవచ్చు.

ఔదార్యం:

పెద్దరైతులు తమ పొలాలలో పండే పంటను వారిదగ్గర పనిచేసే పాలికాపులకు, కమతం మనుషులకు ఉదారంగా పంచిపెడతారు అందువలన వారు తమరైతులకు లాభాలు ఎక్కువ రావాలని ఎంతో శ్రద్ధగా పొలాల ఆలనాపాలనా చూసి పంట ఎక్కువ పండేటట్లు చూసుకుంటారు. అందుకే విచ్చలవిడిగా వదిలేసినా పొలాలలో దొంగతనాలు ఉండవు. ఒకసారి ఒకరైతుచేలో ప్రక్కరైతుతాలూకు పాలేరు పచ్చగడ్డి దొంగతనంగా కోసేస్తే ఈరైతుపాలేరు అతనితో పోట్లాడి ఆ గడ్దిమోపు విడిపించుకొని రక్తసిక్తమైన డేహంతో ఆ గడ్దిమోపు తనరైతు దగ్గరకు తీసుకొచ్చాడు. అదీ వారి స్వామిభక్తి. దొంగతనం చేసినవారిని పోలీస్ స్టేషకి పంపడం కాకుండా ఊరిపెద్దలు రచ్చబండమీద విచారించి శిక్షిస్తారు. ఇలాంటి ఆరోగ్యప్రదమైన విహానాలతో జానపదులు తమకు