పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/50

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

",,,,,,,,,,,,,,,,,,సం
బరమరి దెల్పుమింకొక పబావము
రంకులరాటామెక్కి నే
తిరిగిన సాటిరాదని సుతించును,"

పాల్కురికి సోమనాధుని బసవ పురాణంలో ఇలా వుంది-
" చటిల సంస్కృతి జీవ ఘట చక్ర రర్మ
పటు పరివర్తన భ్రమణంబు గూర్చి
కీలు వూందించి యాక్రియ రాటనముల
వాలి యాడించు నా వడ్రంగియతడు"

ఈ విహారాలు పెళ్ళీకాని పిల్లల పెశ్శిచూపులకు ఒక సాధనం అవుతాయి. ఇలా ఇతర పాంతాలకు వెళ్ళడంలో దేశంలొని మంచిచెడులు, ప్రజల సాధక బాధకాలు అవగర్ మవుతాయి. ఇలా కొన్ని కుటుంబాలు కలిసివెళ్ళి ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకొనడం వల్ల వారిలో ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. పల్లెలలో సధారణంగా స్త్రీ పురుషులు పొలాల్లో పనిపాట్లు సాగించుకొంటూ పైరగాలి ఆశ్వాదిస్తుంటారు నిత్యమూను. ఇదే నిజంగా ఆరోగ్యకరమైన విహారం.

వ్యవహారం:

1. మ ర్యా ద లు:

అతిధులువస్తే ముందుగా కాళ్ళుకడుక్కోడానికి నీళ్ళు ఇస్తారు. వీథిలోనే వాళ్లు కాళ్ళు కడుక్కొని లోనికి ప్రవేశించాలి. దీనివల్ల సూక్ష్మక్రిములు వారి కాలిధూళితో ఇంటిలోనికి రారాకుండా నిరోధించబడుతుంది. ఆ కడుక్కోనెటప్పుడు చిన్న పొడికూడా ఉండకుండా కడుక్కోవాలి. ఈ పొడిగానీ ఉంటే అందులో శని ప్రవేశిస్తుందట. దనికి జానపదులు నలదమయంతుల కధ ఉదహరిస్తుంటారు. నలుడు అన్నిట పరిశుద్దుడే గాని ఒక రోజు కాళ్ళు కడుక్కొనేటప్పుడు మడమపై చిన్న పొడిభాగం ఉండిపోయిందట. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శని దీనితో అవకాశం చిక్కి ఆవహించి అష్ఠకష్టాలూ పెట్టాడట.