పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/444

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గాని ఇద్దరుగానీ ప్రతిపక్షంవారు కాసి దానిని చేతులతో అందుకుంటారు. అలా అందుకుంటే గుటినవాడు ఓడినట్టు. అది వాళ్ళకు దొరక్కుండా క్రిందపడితే పడినదానినితీసి గుంటదగ్గరకు విసురుతారు. అలా విసరగావచ్చే బిళ్ళను ఆటగాడు తిరిగి కర్రతో అదుటికికొడతాడు. అప్పుడు అది కర్రకు తగలకుండాగాని, తగిలిగాని క్రిందపడి గుంటనుంచి ఒక కర్రకొలతకంటే తక్కువవుంటే ఆటగాడు ఓడినట్టు. ఎక్కువఉంటే అక్కడి నుంచి గుంటదగ్గరకు కర్రతోకొలుస్తారు. ఈ కొలతను ఒకటి, రెండు, మూడు అనికాక "కర్ర, కండి, నర్ర, నడ్డి, మూల, ముడ్డి" అని చిత్రమైన మాటలతో లెక్కిస్తారు. అలా పదికర్రలుంటే ఒక 'లాల '. లాలకు ఒకదెబ్బచొప్పున్ పడివున్న బిళ్ళచివర కర్రతోకంగించి పైకిలేవగొట్టి దూరంగా కొడతారు. ఆ బిళ్ళపడినచోటునుంచి ప్రతిపక్షంవ్యక్తి 'అల్లి బిల్లి చెంగన్నరి కీర్, కీర్, కీర్ ' అంటూ గుక్కతిప్పకుండా కూస్తూ గుంటదగ్గరకు వస్తాడు. మధ్యలో కూత ఎక్కడయినా ఆగితే అక్కడనుంచి మళ్ళీ యిందాకటిలాగానే ఆబిళ్ళను కర్రతో కొడతాడు ఆటగాడు. మళ్ళీ అక్కడినుంచి కూస్తూ గుంటదగ్గరక్రావాలి. ఈబిళ్ళను గూటినప్పుగానీ, పైకెలేవదీసినప్పుడుగానీ ఎదుటివారు ఆబిళ్ళను క్రిందపడకుండా పట్టేసుకున్నా, గుక్క ఆగకుండా 'కీరు ' కుంటూ గుంటదగ్గరకువచ్చేసొమా ఆటగాడు అవుటే. ఈ ఆట ఎక్కువగా దమ్మునిలబెట్టడాన్నీ, ఎదురువచ్చే వస్తువును యిట్టేపట్టేసుకోవడంలో కౌశలాన్నీ నేర్పుతుంది.

         ఎదుటినుంచివిసిరేబిళ్ళను కర్రతోకొట్టడంతీరూ, నేటి క్రికెట్ ఆటలో ఎదరనుండివిసిరేబంతిని బేట్ తోకొట్టడంతీరూ పరికిచిచూస్తే ఈ రెండింటికీ 'వంశవృక్షం ' ఒకటే అనిపిస్తుంది.
               *"ఈ ఆటను బుద్ధఘోషకవి ఇంచుమించు 1400 ఏండ్లనాడు "ఘటికా ఖేలనము" అని వర్ణీంచాడు.  ఘటిక అనగా చిన్నకర్రపుల్లను పెద్దకర్రపుల్లతోకొట్టుట అని కవి వర్ణీంచాడు.

    * ఆంధ్రుల సాంఘిక చరిత్ర.  సురవరం ప్రతాపరెడ్డి.