పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/348

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఒడిదుడుకులులేకుండా చాకలిసర్వయ్య, మంగలివీరేశం జాగ్రత్తగా తీసుకెళుతున్నారు. పల్లకీలు రెండూ సాగిపోతున్నాయి ఇంతలో అల్లకీలోనుంచితొంగిచూచింది మంగమ్మ. ఆపండి పల్లకీలంది. పింగళికునిపిలిచి అడుగోమీబావ వెళ్ళి అడుగు అంది. వెంకన్న దూరంగా అందకుండా వెళ్ళీపోయాడు. మంగప్రాణం వుసూరుమంది. మరల పల్లకీలు ప్రయాణం సాగించాయి. అయితే వానికంటే ముందు కాలినడకన వెంకన్న ఆలంవారిపట్నంవెళ్ళి వారి యిరుగిళ్ళు పొరుగిళ్ళలో పొంచున్నాడు. ఇది తెలిసిన ఆలమందారకునికి కోపమొచ్చింది. పోలీసుల్నిపిలిచి వెంకన్నను పట్టుకు తీసుకురమ్మన్నాడు. వారు పట్టుకోవడానికి ప్రయత్నించారు. వెయ్యిమాలలవాడు వేల్పువెంకన్న దొరికెతేగా! ఎగువ వీధిలో పోలీసులుంటే దిగువవీధిలో వెంకన్న, వీరు దిగువవీధికెడితే అతను మరొకవీధి. మొత్తంమీద పోలీసులు అలిసిపోయాదు. వేడికోలు మొదలుపెట్టారు. "మీరు మాకురక్కుంటే మాజీతాలూ నాతాలూ పొతాయి. పిల్లలూజల్లలూ ఆకళ్ళతో అలమటించిపోతారు. కనబడుస్వామీ!" అని బ్రతిమాలుతుంటే వెయ్యిమాయలస్వామికి జాలివేసింది. పోలీసులకు ఎదురొచ్చి దొరికిపోయాడు. వారు ఆలంవరిలోగిల్లో దిగవిడిచారు. వచ్చిన వెంకన్న దగ్గరకు మంగమ్మరాగా "మీనాన్న యిస్తానన్న కట్నం యివ్వలేదు. నామీద ఆశలు చాలించుకో" అనిచెప్పి దిగువతిరుపతికి వచ్చేశాడు. తల్లి పేరిందేవిదగ్గర తలవంచుకుని నిలబడ్డాడు. ఆమె ఆశ్చర్యపోయి "మీఅత్తవారింట మర్యాద జరగలేదా? ఏమి వచ్చేశావు?" అంది. "నాకు కంచుచెంబులతో నీళ్ళివ్వలేదు - మట్టి ముంతలతో నీళ్ళిచ్చారు. కూర్చోడానికి చాలీచాలని పీటవేశారు. ముడికలు దిగని చాపులుపెట్టారు. బూరెలొండారు బుడ్డిముంతలతోటి - గారెలొండారు గాదైకింద కప్పలు - అరిశలోండేరు అరవదాని చెవులు. వాళ్ళ అన్నం సున్నం కంపుకొట్టింది. నేను మంగను ఏలను" అన్నాడు. దానికి తల్లి "వాళ్ళేమెజెసు వాళ్ళధనమేమిజేసు? మంగ మనయింటికొస్తే అన్నీ మనమేనేర్పుకొందా"మంది. ఇది తలకెక్కలేదు వంకన్నకు. ఏడుకొండలపైకి ప్రయాణమయ్యాడు. చుక్కలగిరిపర్వతం చూసేడు. నాలుగుమూలలకీ త్రొక్కిచూసాడు. కాలుకింద ఏకొండా యిమడలేదు. చలువరాతి కొండపైకి ఎక్కాడు. విమలగిరిపర్వతం ఎక్కాడు. దానిపైన కడిమి చెట్టుంది. దానికిందకూర్చున్నాడు. వాళ్ళక్క దుర్గక్క జ్ఞప్తికొచ్చింది. గొంతెత్తిపిలిచాడు. "తమ్ముడా వస్తున్నాను భయంలెద"ని ప్రత్యక్షమై