పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/322

ఈ పుటను అచ్చుదిద్దలేదు

28. వంతం త్యాగరాజు పార్టీ:-

     భట్లమగుటూరు (ప.గో.)  త్యాగరాజుగారు మంచి కధకులు, మంచి గాయకులు.  గానంతో కధ రక్తికట్టించేవారు.  వ్యాఖ్యాత శ్రీఆరట్లకట్ల సోమేశ్వరరావు, వీరిది రాజకీయోపన్యాసంలాగుండేది.  శ్రీ జోస్యుల రామం హాస్యం, వీరికి 'వికటకవి ' అని బిరుదు.

29. దాసరికృష్ణ బుర్రకధ దళం;-

       భీమవరం, కధకులు శ్రీ దాసరి కృష్ణ వ్యాఖ్యాత శ్రీ దాసరి వెంకన్నబాబు.  హాస్యం శ్రీ దాసరి శాయిబాబు.  వీరు ముగ్గురూ సోదరులే.  నాజర్ ప్రశంశలనందుకున్న దళం.

30-. రత్నం బుర్రకధ దళం:-

     తణుకు.  కధకురాలు శ్రీమతి రత్నం, వ్యాఖ్యానం శ్రీ కే. నాగేశ్వరరావు,  హాస్యం శ్రీ వి.నాగేశ్వరరావు, హార్మోనీ, దోలక్ వీరికి సహకారులు.  సీతాకళ్యాణం, చంద్రహాస, వీరాభిమన్యకధలు బాగాచెబుతారు.

31. డి. వెంకట్రావు బుర్రకధ దళం:-

      భీమవరం.  కధ శ్రీ వెంకట్రావు, మంచిగాయకుడు.  హాస్యం శ్రీ దాసరి నరసింహమూర్తి,  వ్యాఖ్యానం శ్రీలింగమూర్తి.  పల్నాటియుద్ధం, బొబ్బిలియుద్ధం వీరికధలు.

32. సింహాచలం బుర్రకధ దళం:-

     భీమవరం.  రచయిత, కధకులు శ్రీ సింహాచలం హాస్యం శ్రీ వెంకట్రాజు, - వ్యాఖ్యానం శ్రీ చల్లారావు.  ఆంధ్రకేసరిబుర్రకధ, అమరజీవ్గి బుర్రకధ ఆంధ్రదేశమంతటా చెప్పేరు.  ఆదిలో సింహాచలంగారు 'కన్యక ' జముకులకధచెప్పేవారు.  ఎంతొమందికి బుర్రకధల్లో తర్ఫీదుయిచ్చారు.

33. కొమరశ్రీ బుర్రకధ దళం:-=

      కాకినాడ.  కొమరశ్రీ అసలుపేరు శ్రీ కె.అప్పారావు.  వీరు కధకులు. నాజర్ బాణీ, హాస్యం శ్రీ కాశీరాం, వ్యాఖ్యానం శ్రీ కే. కోదండరావు.  బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం, ఖడ్గతిక్కన, అల్లూరి సీతారామరాజు వంటి కధలు దేశంలో వేలాదిచెప్పారు.  శ్రీ నాజర్ చే సింహతలాటం తొడి