పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/30

ఈ పుటను అచ్చుదిద్దలేదు

5

జానపద విజ్ఞానం


జానపదమనేది జనపదశబ్దజనితం. జనపదమనగా నైఘంటికార్ధములు గ్రామము, దేశము అని. ఇందు సాహిత్యపరంగా గ్రామమను అర్థమే రూఢి అయ్యింది. గ్రామమంటే పల్లె. కనుక జానపదమంటే పల్లె జనులకు సంబంధించింది అని చెప్పుకోవచ్చును.

జానపదమనగా దేశము, గ్రామము, గ్రామములనుండి పొందు పన్ను మొదలగు అర్ధాలుకూడా ఉన్నాయి. అలాగే జానపదుడు అంటే మనుష్యుడు అనీ, జానపదులంటే పల్లెటూరివాండ్రు, మోటువారు అనీ నిఘంటువులో చెప్పబడ్డా వ్యవహారంలో జానపదులనగా పల్లెజనులనీ, జానపదమనగా పల్లెజనులకు సంబంధించిన విశేషం అనీ మాత్రమే స్థిరపడింది.

1. " జనపదము అనగా పల్లెటూరు. జనపదమున నివసించు జనులు జానపదులు ".

1.1. " జానపద విజ్ఞానాన్ని ఇంగ్లీషులోని ఫోక్‌లోర్‌కు సమానార్ధకముగా వాడుతున్నారు. ఈ ఫోక్‌లోర్ అనే పదాన్ని డబ్ల్యు.జె.ధాంస్ 1846లొ రూపొందించాడు ".

1.11 " జానపద విజ్ఞానానికి సంబంధించిన నిర్వచనము బ్రూస్ వాండ్ ఇలా చెప్పాడు ".

"Those materials in Culture that circulate traditionally among members of any groups in different versions whether in oral form or by means of customary example".