పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/209

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేదాలు మహర్షులయొక్క జ్ఞానసముదాయాలై తే సామెతల్ని సామాన్య జనులయొక్క అనుభవ సారాలుగా పేర్కొనవచ్చు.

                                                 ----కాలెపు వీరభద్రుడు.
  • నిత్యజీవితంలో సామేతల ఆమెతలు వడ్దించనివారూ, తినని వాడూ ఉండడు. వ్క్తవ్యవిషయావబోధకు సులభసాధనం సామెత-విషయాన్ని నిశితంగా సూటిగా స్పష్టంగ సామ్యరూపంలో వ్యక్తం చెయ్యడానికి ప్రతిఒక్కరికి ఉపకరించేదే సామెత. ఈ సాధనసంపత్తి ఎవారిలో ఎక్కువవుంటే వాడు మాటకారి. సామెత ప్రసంగానికి ప్రాణం. అంతేకాదు ఏ రచనకైనా జనజీవాల్ని ప్రసాదించేవాటిలో సామెతలు ప్రధానమైనవి"
                                                   --ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి
    • "సామాజికమైన తరతరాల అనుభవాన్ని ఇముడ్చుకుని సామ్యత, ప్రభావోత్పాదకత, ధ్వని ప్రాధాన్యత, ప్రజా ప్రాచుర్యం, శ్రావ్యత కలిగి సంభాషణాయేగ్యమైన సంక్షిప్తవాక్యం తెలుగు సామెత."
    ఈ సామెతలు  ఒకో ప్ర్రాంతంలో ఒకోలగ ఉన్నాయి.  గొదావరి సీమలో జానపదుల సామెతలు ఈ క్రిందిరీతి పదునుగా ఉంటాయి.

అరిచేకుక్క కరవరు
అర్ధరాత్రికాడ అంకమ్మచివాలని
అమ్మబోతె అడివి, కొనబోతెకొరివి అన్నట్లు
అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కునినానివ్వదు
అత్త సొమ్ము అల్లుడుధారబోసినట్టు
అన్నీఉన్నాయి, ఐదోరనమే లోటు
అడ్డాల్లోబిడ్డలు గాని, గెడ్డాలొచ్చేక బిడ్దలా ?
అంగట్లో అన్నీఉన్నా, అల్లుడినోట్లో శని అన్నట్లు
అంతా శ్రీవైస్ష్ణవులేఅయితే బుట్టెడు రొయ్యిలూ ఏమయినట్టు?
అందితేజుట్టు, అందకపోతే కాళ్ళు


  • (డా|| పి. నరసింహారెడ్దిగారి 'తెలుగు సామెతలు, జనజీవనం ' గ్రంధంలోని ఆప్తవచనం. పు. 1. నుండి గ్రహింపబడినది)


    • డా|| పి. నరసింహారెడ్ది (తెలుగు సామెతలు జన జీవనం నుండి)