పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/118

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జానపదం - నాగరికం

"కృత ప్రజ్ఞశ్చ మేధావీ, బుధో, జానపదశ్శుచి:" అన్నాడు జానపదుల్ని వాచస్పత్యకారుడు.

జనపదమనగా పల్లెటూరు - పల్లెటూరు జనులకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, అలవాట్లు మొదలగు పద్ధతులూ, విశేషాలు జానపదాలని నిర్వచించుకొవడం జరిగింది. ఇంక నగరంలోనివశించు జనులు నాగరికులు అని నిర్వచించుకుంటే నగరవాసుల జీవితానికి సంబంధించిన వెశేషం నాగరికం అని చెప్పుకోవచ్చు. దీనినే 'నాగరికత ' అని కూడా పిలుస్తారు.

  • "ఈనాడ్ మనము 'సివిలిజేషన్ ' అన్న మాటకు సమానార్ధకముగా నాగరికత అన్న పదం వాడుతున్నం. నగరవాసి నాగరికుడు, తత్ భావం నాగరికత. ఆ దృష్ఠిలోనయితే జనపదంబహుళమైన భారతదేశంలో నాగరికత తక్కువనే చెప్పాలి. కాని నాగరికత అంటే ఏదో మేడ మిద్దెలమీది బాబుల డాబులు, వేడుకలు, వేడబములు చీని చీనాంబరాడంబరాలు అనిగాక మానవత్వాల్ని సుప్రతిష్ఠితం చేసి దాన్ని తరతరాలుగా సంరక్షించేటటు వంటి, జాతిని జాగృతంచేసి దానిని సత్కార్యాచరణాభిముఖంగా నడిపించేటటువంటి, నిరాడంబరమైన చిత్తశుద్దికి నికషోవలమైనటువంటి, ఒక వంక జాతియొక్క ప్రాభవ ప్రత్యేకతలను నిరూపిస్తూనే మరొకవంకదాన్ని విశ్వమానవ సమాజైకతానమయిన భావనకు సన్నిహితంచేసేటటువంటి ఒక ఉన్నతమైన మనస్తత్త్వాన్ని కలిగించే పరిస్థితిగా గ్రహిస్తే అలాంటి ఉత్తమసంస్కృతికి ఉనికి పట్టులు మనదేశంలోని ప్రాచీన తపోవనాలు జనపదాలు" అన్నారు జాతీయాచార్య శ్రీ యస్. వి. జొగారావుగారు.

ఐతే ఆంగ్లేయులు మన దేశమందు నెలకొల్పిన విద్య, వారి దుస్తులు, ఆచారాలు ప్రజల్ని ఆకర్షించాయి. పలువురు పాశ్చాత్య విద్య నభ్యసించి ఉన్నత పదవులు పొందారు. ప్రభుత్వం వారికి


  • నేదునూరి గంగాధరంగారి జానపదగేయ సాహిత్య వ్యాసావళి పీఠిక. పుట 1