పుట:GodavarisimaJanapadaKalaluKridaluVedukalu.djvu/102

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉంటుంది. మగవాళ్ళు చిన్న గుడ్డ 'గోచీలాగ పెట్టుకుంటారు. కొందరు సంతలో కొనితెచ్చుకొన్న పాతచొక్కాలు తొడుక్కుంటారు. తలలు కొబ్బరినూనె సంస్కారము ఎరగవు. వారి మంచితనం, అమాయకత, సంతృప్తి చూస్తే వీళ్ళే నిజమైన మానవులనిపిస్తుంది.

                         లంబాడీలు

ఈ గిరిజన జానపదులలోలంబాడీ తెగ ఒకటి. పశ్చిమగోదావరి జిల్లాలోజంగారెడ్దిగూడెం బుట్టాయిగూడెంలలో వీరి తండాలున్నాయి. వీరి జనపదాలను 'తండా ' లంటారు. తాడేపల్లిగూడెం సంతలో ప్రతి ఆదివారం కనిపిస్తూంటారు. వీరి ఆబరణాలు, ఆచార వ్యవహారాలు బహు చోద్యంగా ఉంటాయి.

అద్దాలు పొదిగిన రంగు రంగుల పరికిణీలు, వీపులేని దళసరి జాకెట్లు, చేతినిండా దంతపు గాజులు, తలనుండి ముందుకు వేళ్ళడే ఇత్తడి బుకాలు, వనక్కి వేలాడే రుతకదుప్పటిముసుగుధరించే యీ స్త్రీలనుచూస్తుంటే నాగరికత వీళ్ళకి ఎన్ని ఆమడలదూరంలోఉందో అనిపిస్తుంది. బహుళ ప్రాచుర్యంపొందిన "లంబాడోళ్ళరామదాసు" పాట వింటుంటే ఆజాతి అమాయకత, ఆర్ద్రత, నిస్సహాయత హృదయాన్నిద్రవింపజేసుంది.

ఇంతకీ మీరెవరమ్మ అని తొంబది ఏండ్ల ముదుసలి అయిన లంబాడీస్త్రీ బాణావతు దుర్గమ్మను ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం చాలా ఆసక్తికరంగావుంది. ఆదిలో మర్వాడీలూ తామూ ఒకేతండ్రి బిడ్డలమనీ, ఆ తండ్రి మొదటి భార్య సంతతి లంబాడీలనీ, రెండవభార్య బిడ్డలు మార్వాడీలని చెప్పింది. అయితే మర్వాడీలకామహర్దశ ఏమిటి మీకు యీ దుర్గతి ఏమిటి అని ప్రశ్నిస్తే చెప్పినకధ యిది-- ఆ తండ్రి ఆస్తి పంపకాలప్పుడు బంగారమంతా పెంటకుప్పల్లోనూ, పేడకుప్పల్లోనూ దాచి వానిని ఒక వాటాగాను, గొడ్డు గోద వగైరా పశుసంతరి ఒక వాటాగాను పెట్టి కావలసిన వాటాతీసుకోమంటే మర్మమెరుగని వీళ్ళు పెంటకుప్పలు, పేడకుప్పలు తమకు వద్దని పశువుల్ని తీసుకున్నారట. నాటినుంచీ వీరు అడవి ప్రాంతాలలో పశువుల్నిమేకల్నీ మేపుకుంటూ అడవి భూముల్లో జొన్న, సజ్జవగైరాలు పండిస్తూ వానిని తీసుకొచ్చి