పుట:Gidugu Rammurthy Mundu matalu.pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48. పోర ఇంగ్లీష్ డిక్ష్నరీ

భాషా విద్యార్థికి ఈ పోలికలను తెలిపే చిన్న పట్టికను మాత్రం ఈ పీఠిక తరువాత ఇచ్చి తృప్తి పడుతున్నాను. అది వారిలో ఉత్సాహమును కలిగిస్తుందని నా ఆశ.

నాకు ఎన్నో విధముల సహాయముచేసి, నేను సోర భాషాధ్యయనములో సాధించిన ఫలితాలు నశించి పోకుండ భద్రపరచుటకు వీలుగా వాటిని ప్రచురించినందులకు మద్రాసు ప్రభుత్వమునకు, దాని విద్యాశాఖాధికారులకు, జిల్లా శాఖాధికారులకు, నాకృతజ్ఞతలను తెలియజేసు కొంటున్నాను. సోర భాషను వ్యావహారిక అవసరాల కొరకు చదివే వారికి, ప్రపంచం మొత్తం మీద భాషాశాస్త్ర పండితులకు, ముఖ్యంగా అంతగా తెలియక పోయినా ఎక్కువ ఆసక్తి కలిగించే ఆస్ట్రిక్ భాషా కుటుంబాల యొక్క పరిశోధనలలో ఉన్న వారికి ఈ నిఘంటువు ఉపయోగపడుతుంది.

నాకుమారుడైన సీతాపతి సహకారము లేనిదే ఈ నిఘంటువు ప్రచురణ జరిగేదికాదని నేను వేరే చెప్పనక్కరలేదు.

నిర్దుష్టంగా చక్కగా ముద్రించి ఈ నిఘంటువును ఉపయోగించే వీలు కలిగించినందులకు ప్రభుత్వ ముద్రణాలయం సూపరింటెండెంట్ గారికి నా కృతజ్ఞతలు.


0--------