ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈజన్మము
ఈ జన్మ మిక దుర్లభమురా,
ఏ జన్మసుకృతమో ఈనాడు బ్రతికుంటి మీ||
ఈశ్వరుడె గాంధిగా ఇల నవతరించాడు
అందులో మము గన్న, హిందూమాతకడుపున నీ||
ధర్మదేవత మూర్తి దాల్చింది గాంధిగా,
కళ్లార మన మతని, గాంచి ధన్యుల మైతి మీ||
భారతలక్ష్మికి, భాగ్యరేఖా గాంధి,
అతడె మననాయకు,డాయె నెంతటిభాగ్యమీ||
ఈశోభ గనుభాగ్య, మే నోముపంటో,
ఈయజ్ఞములొ చావు, యేపుణ్యఫలమో
ఈజన్మ మిక దుర్లభమురా,
యేజన్మసుకృతమో, ఈనాడు బ్రతికుంటిమీ||