ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రము : బందిపోటు (1963)
పాట : ఊహలు గుసగుసలాడె
""""""""""""""""""""""""""""""""""""""""""""
ఆశలు మరిమరి రేగే, మా హృదయము ఆరడిచేసే

చ॥ విడలేము మనసున మోహము
ఘనమైన జ్ఞానము కోసము
నీ మాయలో, బలముందిలే
అది మాకు ముందే తెలుసు
ఆశలు మరిమరి రేగే, మా హృదయము ఆరడిచేసే

చ॥ తుదిలేని ఈ సంసారం
విడలేని బందమదాయె
నీ జ్ఞానము, లేకున్నచో, విడలేము కర్మము కూడా
ఆశలు మరిమరి రేగే, మా హృదయము ఆరడిచేసే

చ॥ నిను చేరి కొలచినవేళ
మనసేమో నిలచెను మాలో
హృదియోగమూ, మదిజ్ఞానమూ, వెలసెను మాలో
ఆశలు మరిమరి రేగే, మా హృదయము ఆరడిచేసే



చిత్రము : నిప్పులాంటి మనిషి (1974)
పాట : స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
""""""""""""""""""""""""""""""""""""""""""""""
జ్ఞానమే నా జీవితం....., జ్ఞానమేరా శాశ్వతం....
జ్ఞానమే నాకున్నదీ..... జ్ఞానమే నా పెన్నిధి....
జ్ఞానమే.... హోయ్‌.... జ్ఞానమే నా జీవితం...జ్ఞానమేరా శాశ్వతం