ఈ పుట ఆమోదించబడ్డది

23. తే. కాయ మియ్యది విడుదల గాకమునుపె
ద్వేషరాగంబులం గల్గు వేగ మెల్ల
మాన్పి శాంతంబు దాల్చు సమర్థుఁ డెవఁడొ
వాఁడెసుమి యోగయుక్తుండు వాఁడె సుఖుఁడు.

24. ఆ. ఆత్మయందె సుఖము నాత్మయందే క్రీడ
యాత్మయందె జ్ఞానమలవరించు
నట్టివాఁడె యోగియతఁడె జ్ఞానస్వరూ
పమున నాత్మ ననుభవం బొనర్చు.

25. ఆ. సర్వభూతహితము సల్పుచు, ద్వంద్వంబు
లను నశింపఁ జేసి మనసు నిల్ప
నేర్చుజ్ఞానవరులు నిర్ధూతకల్మషు
లగుచు నాత్మసుఖము ననుభవింత్రు.

26. తే. కామమును గ్రోధమును వీడఁగల్గువారు,
యతులు, నిగ్రహచేతస్కులైనవారు,
మనసు స్వాధీనపడియుండు మౌనిజనులు,
మోదమున నుంద్రు సర్వదా మోక్షమందె.

27. తే. స్పర్శశబ్దాది బాహ్య విషయసుఖముల
మాని భ్రూమధ్యమున దృష్ఠి నూనఁజేసి
ప్రాణమును నసానము సమత్వంబుఁ బొంది
నాసికలయందు సంచరణం బొనర్ప.