ఈ పుట ఆమోదించబడ్డది

41. తే. అందుచే నింద్రియంబుల నణఁచిపెట్టి
జ్ఞాన విజ్ఞానములను నాశన మొనర్చు
నదియుఁ, బాపంబుఁ జేయించునదియు నైన
కామమును ద్రుంపు మీవు సుత్రామతనయ!

42. తే. ఎంతు రివి శ్రేష్ఠము లటంచు నింద్రియముల;
వానికంటెను హెచ్చండ్రు మానసమును;
మనసుకంటెను బుద్ధిని ఘన మటండ్రు;
ఆత్మ దానికంటెను గూడ నధిక మండ్రు.

43. తే. కనుక బుద్ధికంటెను మేలుగాఁ జెలంగు
నాత్మయందె మనస్సు నైక్యం బొనర్చి
కామరూపమై యడఁప శక్యంబుగాని
శత్రువును గెల్వుమీ నీవు సవ్యసాచి!


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

మూడవ అధ్యాయము, కర్మయోగము సమాప్తము.