ఈ పుట ఆమోదించబడ్డది

ఓమ్‌

శ్రీకృష్ణపరబ్రహ్మణేనమః

శ్రీమద్భగవద్గీత

అష్టాదశాధ్యాయము.

మోక్షసన్న్యాసయోగము


అర్జునుడిట్లనియె :-

01. తే. త్యాగసన్న్యాసములు రెంటి తత్త్వములను
వేఱువేఱ నిరూపింప వేఁడుచుంటి
దేవదేవ! హృహీకేశ! దివ్యచరిత!
కేశిసంహార! నామీఁదఁ గృపఁ దలంపు.

 శ్రీ భగవంతుడిట్లనియె :-

02. తే. కామ్యకర్మంబు లెల్ల ద్యాగంబుఁ జేయు
టదియ సన్న్యాస మంచుఁబల్కుదురు కవులు
సర్వకర్మలఫల విసర్జన మొకండె
త్యాగ మంచు విచక్షణులండ్రు విజయ!

09. ఆ. కర్మఫలమునందుఁ గర్మంబునందు సం
గంబు విడిచి నియత కర్మ మెల్లఁ
గార్య మిది యటంచు ఘటియింపఁబడెనేని
నదియ సాత్త్విక మగు త్యాగ మండ్రు.

10. తే. అశుభకర్మలపై ద్వేషమందఁబోఁడు;
మంచికర్మల కొఱకుఁ దామరులు గొనఁడు;
త్యాగి గతసంశయుండు మేధావియైన
సత్త్వగుణశాలి యగునట్టి సజ్జనుండు.

11. తే. ధర నశక్యంబ యగు దేహధారి కర్మ
ములఁ ద్యజింపంగ నిశ్శేషముగఁ గిరీటి!
కనుకఁ గర్మఫలంబు త్యాగంబు సేయు
నట్టియాతఁడె త్యాగి యౌనవనిఁ బార్థ!