ఈ పుట ఆమోదించబడ్డది

11. తే.దేహమందలియెల్ల యిం`ద్రియములందు
నున్న దున్నట్లు తెలియుజ్ఞానోద్భవం బ
దెపుడు కన్పట్టునో యప్పండే యతనికి
వృద్ధియగు, సత్త్వగుణ మటం చెఱుఁగవలయు.

12. తే. లోభగుణము, వృథాచేష్టలును, ఫలాశ
తోడికర్మంబులు, నశాంతి గూడియుండు,
లోప మొందుట, యవి పొడ సూపునపుడె
వృద్ధియగు, రజోగుణ మని యెఱుఁగవలయు.

13. తే. అప్రకాశంబు మోహంబు నప్రవృత్తి
మఱి యకార్యంబు లొనరింప మనసు చనుట
యెపుడు పొడసూపునో యప్పుడే నరునకు
వృద్ధి యగుఁ దమోగుణ మంచు నెఱుఁగవలయు.

14. ఆ. సత్త్వగుణము వృద్ధిఁ జరియించుచుండఁగా
మరణ మొందునట్టి మానవులకు
మరలఁ గల్గు నుత్తమ జ్ఞానవంతుల
శుద్ధలోక సిద్ధి యిద్ధచరిత!

15. ఆ. నలిరజోగుణంబునం జచ్చునరునకుఁ
గర్మసంగ మెపుడుఁ గల్గుచుండు;
తమము వృద్ధిఁ జెందు తఱి మరణించువాఁ
డుద్భవించు మూఢయోనులందు.

16. తే. సత్కృతం బగుకర్మంబు సాత్త్వికమును
నిర్మలమునైనఫలము జనింపఁ జేయు;
వ్యసనమే యుద్భవించు రాజసము వలనఁ;
దామసము చేత నజ్ఞాన తతయె కల్గు.