ఈ పుట ఆమోదించబడ్డది

34. ఆ. ఎట్లు సూర్యుఁ డొక్కఁడీలోకమెల్లఁ బ్ర
కాశ మొందఁ జేయఁ గలడొ, యట్లె
యాత్మ తనదు దేహ మంతయు వ్యాపించి
వెలుఁగుఁ బుట్టఁజేయఁ గలుగు బార్థ!

35. తే. జ్ఞాననేత్రంబుచే, నెట్టి జనులు ప్రకృతి
పురుషులకుఁ గల భేదంబు భూతజాల
ముల స్వభావంబు మోక్షంబుఁ దెలియఁగలరొ,
వారు బ్రహ్మసాధర్మ్యంబుఁ బడయఁగలరు.


బ్రహ్మవిద్యాశాస్త్రమైన భగవద్గీతలోని

పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము సమాప్తము.