పుట:Geetha parichayam Total Book.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది

ఆచరణను బట్టి పాపము వచ్చుచుండును. అట్లే జ్ఞానధర్మములను బట్టి పాపపుణ్యములనబడు కర్మ నశించిపోవడము జరుగుచుండును.

నీతి, ప్రపంచమున మానవుని ప్రవర్తనను సూచించి సత్ప్రవర్తునిగ జేయును. మానవుని ప్రవర్తన మీదనే న్యాయాన్యాయములు ఆధారపడి ఉండును. ప్రవర్తన సరియైనపుడు న్యాయమని, ప్రవర్తన సరికానపుడు అన్యాయమని నిర్ణయింపవలసి ఉండును. అట్లే జ్ఞానము ఆధ్యాత్మికముగ మానవుని కట్టుబాట్లను సూచించి సత్పురుషునిగ (యోగిగ) మార్చును. జ్ఞానమును ఆచరించడము మీదనే ధర్మాధర్మములు ఆధారపడియుండును. మానవుని బాహ్యాచరణకు సంబంధించినది న్యాయము కాగ, అంతర్‌ భావముల మీద ఆధారపడినది ధర్మము. అంతర్‌ ఆచరణమున ధర్మము బాహ్యములో అవినీతి, అన్యాయముగ కనిపించవచ్చును. అందువలన ధర్మములివియని చెప్పిన శ్రీకృష్ణుడు కూడ బాహ్య ప్రపంచములో కొందరికి అసత్యపరుడుగ అక్రమాలు చేసినవాడుగ కనిపించాడు.

వాస్తవానికి నీతి న్యాయమిదియని, జ్ఞాన ధర్మములివియని తెలిస్తే గాని ఎదుటి వానిని పూర్తిగ గుర్తించలేము. నీతి న్యాయము తెలిసినంత మాత్రమున, ప్రపంచ మానవుల స్థాయిని గుర్తించి చెప్పవచ్చును. కాని యోగమార్గములో ఎవరెంతటివారో చెప్పలేము. భూమి మీద మానవులు నీతి న్యాయమును గుర్తించగలరేమో గాని, జ్ఞాన ధర్మములను గుర్తించుట చాలా కష్టము. అందువలన నేటి కాలములో చాలామంది స్వాములు కూడ జ్ఞానధర్మములివియని గుర్తించలేకపోయారు. జ్ఞానమనుకొని నీతిని పట్టుకొని వ్రేలాడుచున్నారు. ప్రజలకు పుణ్యమొచ్చు పనులనే బోధిస్తు అదే జ్ఞానమాచరణ అనుకొంటున్నారు. పాపపుణ్యములు నశింపజేయు జ్ఞానమును తెలుపలేక పోవుచున్నారు. అందువలన చాలా మంది నీతినే జ్ఞానమని, న్యాయమునే ధర్మమని తలచుచున్నారు. కోర్టులో గల న్యాయమూర్తులను ధర్మమూర్తులని, వారి ఆసనములను ధర్మాసనములని అనడము కూడ వింటున్నాము.