పుట:Geetha parichayam Total Book.pdf/32

ఈ పుట ఆమోదించబడ్డది

సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు యుద్ధరంగములోనికే సరాసరి పరుగెత్తిపోయి యుద్ధాన్ని నిలిపియుండెడివారు. అదియును గాక గీతా బోధ సంజయుడు వినియుంటే "నీకుతప్ప" అని భగవంతుడు అర్జునునితో చెప్పిన మాటే అసత్యమగును. భగవంతుని మాట ఎప్పటికి అసత్యముకాదు. సంజయుడు గీతను విన్నాడన్న మాటే అసత్యమంటే సంజయుడు విని చెప్పకపోతే భగవద్గీతయే లేదు కదా! అను సంశయము ఏర్పడగలదు. ముందు నుయ్యి వెనుక గొయ్యిగ వున్న ఈ ప్రశ్నకు సమాధానము దొరకలేదంటే ఇంతవరకు మనము గీతను సరిగ అర్థము చేసుకోలేదని తెలియుచున్నది. గీత అడ్డంకుల మార్గములో అర్థమైనది గాని, సంశయరహితమైన మార్గములో అర్థము కాలేదని తెలియుచున్నది. ఇటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో తాముండియు, ప్రజల దృష్ఠిలో తెలిసిన వారిగ చలామణి అగుచున్న కొందరు మీ జ్ఞానము ఏపాటిదని మమ్ములను హేళనగ మాట్లాడడము కూడ జరిగినది. అలా వారు మమ్ములను వెక్కిరించినా పరవాలేదు. వారి మూలముగ ప్రజలు గీతను సరియైన మార్గములో అర్థము చేసుకోలేక పోయారన్నదే మా బాధ. ఇంతవరకు సత్యమైన విషయములు ఎవరి బలహీనతతో బయటికి రాలేదో ప్రజలు గ్రహించగలరు. బ్రహ్మవిద్యలో సత్యమును అన్వేషించువారికి, హేతువాదులకు ఇంతవరకు చాలా చోట్ల లభించిన జ్ఞానములో వారియందు ఉద్భవించిన ప్రశ్నలకు జవాబులు దొరకక ఎందరో నాస్తికులైనారు. "మాప్రశ్నలకు జవాబులు లేవు. అంతా బూటకము, మాటలతో మభ్యపెట్టడము తప్ప మరేమిలేదు. దేవుని పేరు చెప్పుచు సంశయాలతో కూడుకొన్న జ్ఞానము చెప్పుచున్నారు" అని నాస్తికులు అంటున్నారు.

అలాంటి నాస్తికులు కూడ మా జ్ఞానము ద్వార వారి ప్రశ్నలకు జవాబులు తీసుకొని, ఈ పద్ధతి ప్రకారమైతే దేవుడున్నాడని ఒప్పుకొనుచుండగ మిగతావారు వెక్కిరించిన పరవాలేదు. చాలామంది గీత రచయితలు మేము అడుగు ప్రశ్నలకు జవాబు చెప్పలేరు. ఎందుకనగా గీతలో విశ్వరూపమునకు