ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

గర్వభంగము నాకగు ♦ గల్లగాదు.
బంధములు తెగు నెంతయు ♦ బాధ నొసగి
వేణుగతినట్టి నామది ♦ విడుచునూర్పు
గట్టిఱాయియు గన్నీట ♦ గరగిపోవు.
నిచ్చలుల్ శతపత్రము ♦నిచ్చకున్నె ?
దానితేనియ తప్పక ♦ తరలి పాఱు
నీలముగ నింగినుండి తా ♦ నిక్కి చూచి
కన్నొకటినాకు రమ్మని ♦ సన్నసేయు;
మిగుల దేమియు నాదేమి ♦ మిగులకుండు;
గందు మరణంబు నీపాద ♦ కమలమందు.

99


నాశిస్త్రాణమును దీసి ♦ నాధ ! యిడిన
దాని ధరియించుటకు నీకు ♦ దరుణ మగును.
కాగ నున్నది యగును ♦ దక్షణమునందె
వ్యర్ధ మీనాదుపోరాట ♦ వ్యర్ధ మయ్య !
స్రాంతమా ! చేతులను దీసి ♦ చప్పు డుడిగి
యోటమికి నోర్చి యుంచిన ♦ చోట నీవు
పరమశాంతిని నుంట లా ♦ భంబటందు
నెంచుమా నాదుహృదయమా ♦ యెంచుకొనుమ.
అట్టె వీచినగాలికి ♦ నారి యారి