ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

నిడినదానికి మించి నే ♦ బడసినాడ;
దెల్ల వాఱెను గదిమూల ♦ దేజరిలిన
దీపమును నారె నే బైలు ♦ దేరుటకును
సిధ్జ మైతిని రమ్మని ♦ చీటి వచ్చె.

94


మేలు గోరుడు నేవీడు ♦ కాలమందు
మిత్రుల్లార ! మదీయన ♦ న్మిత్రులార !
ఆకసము తెల్లవాఱెను ♦ నాకు జూడ
నందముగ గానవచ్చెనా ♦ యాత్రపధము.
అటకు గొనిపోవ నేమున్న ♦ దనుచు మీర
లడుగుకుండు పైన మయ్యెద ♦ నధిపుకడకు
నాశతొ నిండి తోల్కాడు ♦ నాత్మతోడ
దద్దయును రిక్తమైనహ ♦ స్తములతోడ.
పెండ్లిహారంబు మెడను సం ♦ ప్రీతి నిడుదు
బంధువలె దాల్చ నేగాని ♦ వస్త్రములను
తెన్నులోఫ్న నపాయంబు ♦ లెన్ని యున్న
చెదరి చెదరక యుందుదు ♦ మదినినేను
యాత్ర ముగిసెడునంతలో ♦ సంబరమున
సాంధ్యనక్షత్ర ముదయించు ♦ సంజలోన
జాలిగొలిపెడుగీతముల్ ♦ సర్వభౌము