ఈ పుటను అచ్చుదిద్దలేదు
76

గీతాంజలి.

వినయ మొప్పెడుమదితోడ ♦ వెలయు చుండి
నీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతు గాక !
తమపనుల బోరుజనులసం ♦ దడిని గలిగి
కూడి వడివడి జనియెడు ♦ గుంపు గలిగి
పాటుతో నిండియుండు నీ ♦ వసుధయందు
నీముఖాముఖ నెప్పుడు ♦ నిలుతు గాక !
జగములోపల నాపని ♦ ముగిసి నపుడు
మాటలాడక యొంటిగా ♦ మౌననియతి
నీముఖాముఖి నోప్రభు! ♦ నిలుగు గాక !

77


నాకు దేవుండ నీవని ♦ నాధ ! తిలిసి
తొలగి నిలుతును గొంచెము ♦ తొలగి నిలుతు.
నీవు నాస్వంతమే యను ♦ నెఱుక లేక
చేరకుండుదు దగ్గఱ ♦ జేరకుందు
నాకు దండ్రివి నీవని ♦ నాధ ! తెలిసి
యేను నీచరణంబుల ♦ కెఱగు చుందు.
స్నేహితునివలె నీచేత ♦ జేయి నేను
గలప కుండుదు జేతిని ♦ గలప కుందు.
నీవు నాస్వంత మనునట్లు ♦ నిన్నే నాకు
మిత్రునిగ నెంచి మది జేర్చి ♦ మించునట్లు