ఈ పుటను అచ్చుదిద్దలేదు

67

గీతాంజలి.

పనుల దలపుల నిద్రల ♦ స్వప్నములను
నీమెయే యేలుచుండియు ♦ నేకతముగ
దొలగియే యుండు నెప్పుడు ♦ దొలంగి యుండు;
నెందఱో యీమెకొఱకు నా ♦ యిల్లు సేరి
యరుగుచుందురు తుదకు ని ♦ రాశ జెంది.
ఈమెను ముఖాముఖం జూచి ♦ యెఱుగ రెవరు;
నీదుసమ్మతి నొంది తా ♦ నెగడుటకును
వేచి యున్నది యొంటిగా ♦ వేచి యుండె

67


నీదుప్రేమయే గూటిలో ♦ నెగడుజీవు
జిత్రవర్ణమ్ములను మఱి ♦ చిత్రశబ్ద
చిత్రగంధమ్ములం గూర్చి ♦ జిత్రరూప !
మహికి మకుటోత్సవము నల్ప ♦ మోననియతి
విమలసౌందర్యహారంబు ♦ వెట్టి యున్న
పైడిబుట్టను గుడిచేత ♦ బట్టి వచ్చు
భవ్యతరముగ నతము ప్రా ♦ భాతవనిత.
పసులమందలు వీడిన ♦ బయళులందు
జాడ లేనట్టిత్రోవల ♦ జల్లగాను
శాంతపశ్చిమజంధిప్ర ♦ శాంతజలము