ఈ పుటను అచ్చుదిద్దలేదు

63

గీతాంజలి.

మదికి నెంతయు నాయాన ♦ మొదవుచుండు;
గ్రొత్తలో బ్రాంత యుంటయు ♦ గూర్మితోడ
నీవును గూడి యుంటయు ♦ నేను మఱతు.
పరిచయము లేనివానితో ♦ భవ్యమైన
హర్షబంధంక్ము నాయాత్మ ♦ కమర గొల్పి
నెమ్మి దుద లేనినాజీవి ♦ తమ్మునందు
నేకమిత్రుడవై యుండి ♦ యెనగునీవె
యిచట గాని మఱెచ్చట ♦ నేనిగాని
జననమరణాదులందునా ♦ నరన నుండి
నన్ను నడిపించుచుందు వ ♦ నాధనాధ!
నిన్ను నెఱిగిన నిక నున్నె ♦ భిన్నబుద్ది?
తెఱనబడు దల్పులన్నియు ♦ దెఱవబడును
పెక్కులీలల నొక్కడై ♦ వెలయనీదు
ప్రవిమలస్గర్శ కేను దూ ♦ రంబుగాక
యుండ గోరెడునాకోర్కె ♦ పండనిమ్ము.

64


చేరి నేనొకనిర్జన ♦ సీమయందు
నేటవాలుగ బ్రవహించు ♦ నేటియొద్ద
గడు బొదుగుగాగ బెరిగిన ♦ గడ్దిలోన
నిలిచి యిట్లంటి నామెతో ♦ నెలమితోడ;