ఈ పుటను అచ్చుదిద్దలేదు
60

గీతాంజలి.

మృత్యుదేవత స్వేచ్చద ♦ రింపజొచ్చె:
వేడ్కతో నాడుచున్నారు ♦ పిల్ల లెల్ల;
సారమేలేని సంసార ♦ వార్ధితటిని
వేడ్కతో గూడుచున్నారు ♦ పిల్ల లెల్ల

61


శిశువు కన్నుల కదలుచు ♦ జెలగు నిద్ర
వచ్చు నెటనుండి తెలిసిన ♦ వారు గలరె?
ప్రేమ గిన్నరనరులుండు ♦ గ్రామమందు
మిణుగురుబురుంగు మిన్కుల ♦ మించుచుండు
చారుతరపుణ్యకానన ♦ చ్చాయలందు
విమలమోహనమూర్తులై ♦ వ్రేలుచుండు
నిగ్గుల జలించునారెండు ♦ మొగ్గలందు
నదివసించెడు నని నను జను ♦ లనుచునుంద్రు.
శిశువుకన్నుల మొద్దిడి ♦ చెలలగుకొఱకు
వచ్చునిద్దుర యటనుండి ♦ వచ్చుచుండు.
నిదురపోయెడిసిసువుకెం ♦ బెదవులందు
జెన్నుమీఱగ జలియించు ♦ చిన్న నవ్వు
పుట్టు నెచ్చట దెలిసిన ♦ పురుషు దున్నె?
మంచుగప్పినవేకువ ♦ గాంచుకలను
నంతరించు శరన్మేఘ ♦ సంచలమును