ఈ పుటను అచ్చుదిద్దలేదు
58

గీతాంజలి.

పరమపూరుష ! ప్రియతమ ! ♦ ప్రాణనాధ!
నీవు నామది కనుపుసం ♦ దేశ మగుచు
వరదగాజొచ్చె గనుల బ్రా ♦ భాతకాంతి
మించునీమోముపైనుండి ♦ వంచి తీవు;
క్రాలునీకంటిచూపు నా ♦ కనుల వ్రాలె;
భక్తితో నామనంబు నీ ♦ పాదమంటె.

60


పారమే లేనిసంసార ♦ నార్ధితీర
మందు జేరిరి పిల్ల లా ♦ నందముగను;
మీద శాంత మనంతమౌ ♦ మిన్ను పొదలె;
జలధి ఘోషిల్లుచుండె వి ♦ శ్రాంతి గనక;
సారమేలేని సంసార ♦ వార్ధి తటిని
వేడ్కనుం ద్రాట పాటల ♦ బిల్ల లెపుడు.
ఇసుకచే నిండ్ల గట్టుచు ♦ నెనగుచుంద్రు;
నట్టిగుల్లలతో నాడి ♦ వఱలుచుంద్రు;
ఎండుటాకుల బడవల ♦ నెలమి నల్లి
నగుచు విదుతురు తేల సం ♦ ద్రమ్ముమీద;
బారమే లెనిసంసార ♦ వార్ధితటిని
వేడ్కతో నాడుచుందురు ♦ పిల్ల లిట్లు.
ఈద నెఱుగరు వలవైచి ♦ యెఱుగ్ రెపుడు;