ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

ఇంతలోపల నిచట నే ♦ కాంతమందు
బరమసంతొషమున బాట ♦ బాడుచుందు.
గాలియునుగూడా నాశాను ♦ గంధ మంది
పొలయుచున్నది యెంతయు ♦ ముదము నింఫి.

45


ఆలకించి తె నడిలేని ♦ యతనినడక?
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు
బగలు పగలును రే రేయి ♦ యుగము యుగము
నిమిషనిమిషము నాతడు ♦ నిలుపకుండ
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.
వివిధరీతుల నామనో ♦ వృత్తులందు
బాట లెన్నియె నానాట ♦ బాడి యుంటి,
వానిపదజాల మంతయు♦ వ్యక్తపఱచు
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చు నంచు.
చారుపరిమళముల వెద ♦ జల్లి చల్లి
నఱలు చైత్రంబులో నన ♦ పధము వట్టి
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు
ధాత్రి దమి ముంచునవ్యర్ష ♦ రాత్రులందు
నఱుము మేఘరధం బెక్కి ♦ తఱలివచ్చు
వచ్చు వచ్చును సతతంబు ♦ వచ్చుచుండు.