ఈ పుటను అచ్చుదిద్దలేదు
25

గీతాంజలి.

33

పగలు కొందఱు వచ్చి నా ♦ భవనమునకు
"నిచట నొక చిన్నగది యిచ్చి ♦ తేని మేము
సాయపడి దేవపూజలో ♦ స్వామి దైన
వరప్రసాదంబునందు మా ♦వంతు గొందు"
మంచు నొకమూల సాధువు ♦ లట్టులుండి
రాత్రి చీకటిలోన బ ♦ విత్రమైన
గుడి బ్రవేశించి యల్లరి ♦ గదు నొనర్చి
స్వామిసన్నిధిలోనిప్ర ♦ సాద మెల్ల
పతిమలినఘోరభూరిదు ♦ రాకచేత
నాచికొని రేమి చెప్పుదు ♦ నాచరిత్ర ?

34


"నాదుసర్వస్వమా?" యంచు ♦ నాధ ! నిన్ను;
బిలువగా గల్గినాలోన ♦ మెలగుచుండు
నంశమే సర్వదా నిల్చి ♦ యల్రు గాత!
అన్నిటను నిన్నె పొందుచు ♦ సన్నికడల
నిన్నె చూచుచు నాప్రేమ ♦ నిరత మొసంగి
కొలుచునాలోనియంశమే ♦ నిలుచుగాత!
ప్రభువ ! నిను దాప కెప్పుడు ♦ బ్రకటపఱచి