ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

నీతలుపు గష్టదేవత ♦ నిలిచి తట్టె ;
స్వామి మేల్కాంచి సంకేత ♦ సదనమునకు
జిమ్మచీకటి రాత్రిలో ♦ రమ్మటంచు
బుచ్చుసందేశమును నీకు ♦ దెచ్చెనదిగొ !
ఆకసంబున మేఘంబు ♦ లట్టె క్రమ్మి
యెడ తెరపిలేక ధారగా ♦ వృష్టి గురిసె;
నేదియో నన్ను బురికొల్పె ♦ నెఱుగ లేను;
దీనియర్ధం బదేమియో ♦ దెలియ జాల
నిముసమున మించి మెఱపు నా ♦ నేత్రదృష్టి
గాఢతమ మైనతమములో ♦ గాడ ద్రోసె.
రాత్రి చేసెడిగానమ్ము ♦ రమ్మటంచు
బిలుచు; నాదారి నామది ♦ వెదకు చుండె
దీపమా? యేడ నున్నది ♦ దీప మేడ ?
దానివెలిగించుమండు నా ♦ శావలంబె!
ఉఱుముచున్నది; జోరని ♦ యోరుగాలి
విసరికొనిపోవు చున్నది ♦ వింటి యందు;
రాత్రియున్నది నల్లని ♦ ఱాతిరీతి;
గడవకుండును గాక నా ♦ కాలమెల్ల
గాఢమైనట్టి యీయంధ ♦ కారమందె.
ప్రేమ యనుదివ్వె నీదుజీ ♦ తముచేత
జాగుచేయక వెల్గించి ♦ బాగుపడుము.