ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

గీతాంజలి.

బ్రజలతో గూడి చక్కగా ♦ బాటువడితి
గాని యీయొంటిగాఢాంధ ♦ కారవేళ
యందు నాకున్న దెల్ల నీ ♦ యాశ యొకటె.
వదనకమలము జూపి న ♦ మ్ముదము నిడక
ప్రేమమా నీవు నన్ వెలి ♦ వేసితేని
దీర్ఘమైనట్టి యీవర్ష ♦ దినము నెట్లు
గడపగల్గుదునో నాకు ♦ గానరాదు.
దూరముగ్ నాకసంబున ♦ దోచుదమము
వలదె నాదృష్టి నంతను ♦ బొదుపఱతు;
శాంతి మంతయు లేక సం ♦ లత నొందు
వాతమున బడి సామది ♦ నంత దిరుగు.

19


ఈవు మాట్లాడలేనినా ♦ హృదయమందు
మౌనమును జక్కగా నింపి ♦ దాని నోర్తు
ద్లను నోపిక వంచి చు ♦ క్కలనుగూడి
జాగరంబండు రాతిరి ♦ చంద మంది
యెంతయును నేచియుండుదు ♦ శాంతముగను;
వచ్చు దప్పదు నిజముప్ర ♦ భాతవేళ
చిమ్మచీకటి యంతయు ♦ జెదరిపోవు,
ఆకసము జీల్చుకొనుచునీ ♦ యమలవాణి