ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీతాంజలి.

జిన్గునో మాయునో యను ♦ చింతచేతం
దాను జనులకు దూరమై ♦ తలంగు చుండు;
వేడ్క దిరుగాడుటకు గూడ ♦ నెఱచు చుండు,
సౌఖ్య మొసగెడుభూమిర ♦ జంబునుండి.
జనసమూహము లనుగొప్ప ♦ నంతలోన
వేడ్క దిరుగాడుగా గల్గు ♦ స్వేచ్చనుండి,
దూరముగనుంచి తళతళ ♦ ద్యుతుల నీను
బాలురకు నీవు పెట్టిన ♦ బంధనములు
నిష్పలంబులు ; నూతరో ! ♦ నిష్పలములు.

9


ఓరి మూర్కుడ ! నీదుబా ♦ హువులమీద
నిన్ను గొంపోవ నీవు య ♦ త్నించినావె?
నీదువాకిట బిచ్చంబు ♦ నీవె యెత్త
వచ్చినాడవె? భిక్షుకా! ♦ వచ్చినావె?
సకలభారంబు వహియింప ♦ జాలినట్టి
ప్రభుకరమ్ముల బెట్టునీ ♦ భారమెల్ల.
దృష్టి నెన్కకు ద్రిప్పి చిం ♦ తిల్ల బోకు,
తాను ముట్టినదీపమున్ ♦ దత్కషణమున
నూది యార్పును; నీయాశ ♦ యుర్విలోన
మలిన మది ; దానిచేతుల ♦ వలన నీవు