ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత దేశంలో ఆర్ధిక పరిస్థితుల్లో వచ్చిన మార్పునే ఆర్ధిక వ్యాసాలు ఎక్కువ చిత్రించాయి. స్వార్థ పరులకే పరిస్థితులెంత బాగా వుపయోగపడుతున్నాయో చెపుతూ ప్రజలు సుఖపడాలంటే నాశనం కావలసిన అధర్మం ఎంతో వుందంటూ చెప్పే 'ధర్మమేవ జయతే' అనే వ్యాసంలో యీ సంకలనం ముగుస్తుంది.

ఈ వ్యాసాల్ని పఠించేటప్పుడు అప్పటి రాజకీయ, సామాజిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. ఆ సమయంలో వారు హిందూ పునరుద్ధరణ భావాల్ని కూడా ప్రచారం చేశారు. వారి ఉపన్యాసాలకు ఉత్తేజితులై రాజకీయాల వైవు మళ్ళిన వారిలో గరిమెళ్ళ ఒకరు. ఆ అభిప్రాయాలు ఆయనను చివరి వరకు వదలలేదు. అందుకే ప్రాచీన వర్ణవ్యవస్థలో ఉన్నది వర్గ వ్యవస్థే అన్న వాదాన్ని ఖండిస్తూ అది వర్గవ్యవస్థ కాదనీ, అక్కడ దాస్యం, బానిసత్వం లేవనీ, అది ప్రభు సేవక దర్జా అనీ సమర్ధిస్తారు. భారతదేశం రెండుగా చీలిందనే కోపంతో దానికి మొత్తం బాధ్యత ముస్లిం నాయకులదే అంటారు. గ్రామ సంస్కృతిని గొప్ప చెయ్యటం, నౌకరీ చెయ్యటాన్ని చిన్నచూపు చూడడం (నీచంగా చూశారనాలేమో) చేశారు. రష్యాలో వచ్చిన సొషలిస్టు ప్రభుత్వం, అది సాధించిన ప్రగతి అన్నీబాగానే వున్నాయి గాని మన దేశాని కొచ్చేసరికి 'దేశవాళీ ' కావాలి అంటారు. దేశాన్ని బాగు చెయ్యటానికి ఎవరో 'అవతార మూర్తి ' దిగిరావాలంటారు.

సమకాలీన పరిస్థితులు మనుషుల్ని ఎంత బలంగా ప్రభావితం చేస్తాయో గరిమెళ్ల రచనలు చదివితే అర్థమవుతుంది. 'రాజకీయాలనుంచి కవిత్వ విషయాలు ఎన్నుకోవాలి' అన్న గరిమెళ్ళ భావ కవిత్వం ప్రభావానికి లోనై 'వలపు-వగలు' అనే గీతం రాశారు. జానపద బాణీల్లో పాటలు రాసి ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన గరిమెళ్ళ పద్యకావ్యాల ప్రభావంలో పడి 'వేగి ప్రొద్దు తలంపులు' అని దీర్ఘ మాలికలు రాశారు. పై రెండు తప్ప అట్టివి ఇక లభించ లేదు కనుక ఆ ప్రభావాలనుంచి బయట పడ్డారనే అనుకొవాలి.

హిందూ పునరుద్దరణ భావాల ప్రభావం వున్నా, ఆర్ధిక దుస్థితి జీవితాన్ని పట్టి పీడించినా 'మాకొద్దీ తెల్లదొరతనము ' అని గొంతెత్తినపుడు ఏ ప్రజల పక్షపాతొ చివరివరకు కూడా గరిమెళ్ళ అదే ప్రజల పక్షపాతి. తెల్లదొరతనాన్నిVIII