ఈ పుటను అచ్చుదిద్దలేదు

పల్లెటూరి కథలు

విమర్శనము
   శ్రీయుత శనివారపు సుబ్బారావుగారు వ్రాసి ప్రచురించిన "పల్లెటూరి కధలు" అను గ్రంధముతో "తెనుగు చిన్నకధ" కు ఒక క్రొత్త దృక్పధమును, క్రొత్త సందేశమును, క్రొత్త రంగమును చిక్కినవని చదువరులు గ్రహించకపోరు. ఇదివరలో తెనుగు పత్రికలలోను, మాస ఉగాది సంచికలలోను ప్రచురింపబడుచుండు చిన్నకధలలోని యంకము మహొదయమగుచున్న నవయువక యువతీజనంబుల యుద్రేకములును, ఆందోళనములు, సంఘపు కట్టుబాట్లలో కొన్నిచోటుల బ్రాకిన దురాచారముల యొక్క దూషణలును, స్వేచ్చవలె కనిపించు స్వైరవిహార పరతంత్రతలును, వైరాగ్యములును, మరణములును మొదలగు నద్భుతములు (romances) మాత్రమే అయి యుండెడిది. చిన్నకధయొక్క సంకల్పమును, సార్ధక్యమును ఇదియేయని కొందరును, ఇంతియేయని కొందరురును తల్చియుండుటలో నాశ్చర్యము లేదు. చిన్నకధను చూచీ చూడడములో ముందు దానినే పఠించి, ఆ శృంగారమును, ఆ విభావమును, ఆ వైరాగ్యమును అనుభవించి దానిని విడిచిపట్టుట పాఠకుల కలవాటై పోయినది.
     ఇట్టి ఆంధ్రసారస్వతలోకమున నీ గ్రంధమును బ్రచురించి ఇంతకంటె సొగసై మనోహరమైన దిశకు ఈ "చిన్నకధ" చూడగలదన్న సంగతిని గ్రంధకర్త ప్రత్యుక్తముగ ఋజువు చేసినాడు. ఇతదు తొలుదొల్త చేసిన పని నవయౌవన సూత్రాంతమగు మోహమును, దాని పరిణామములను మాత్రమే కధలకు ప్రప్రధానాంశముగ జేయుట మాని, లోక వ్యవహరములను, సంసాత కష్టసుఖములను ప్రప్రధానాంశముగ జేసినాడు. పిదప మోహ పరతంత్రులును, శరీర సౌందర్యోపాసకులును నగు వన యౌవనుల ప్రధాన పాత్రలుగ జేయుట మాని సంసార కష్ట సుఖములు శరీరమునకు నాటి క్రింది మీదులు పడుచున్న గృహస్తులను, గేసురాండ్రను ప్రధాన పాత్రలుగా జేసినాడు. ఈ చిత్రించుటలోనే ఆలోపములు మాయమై సుగుణములు వృద్ధి చెంది, అన్యోన్యత కుదిరి సంసారములు చక్కపడు మార్గములను సూచించినాడు.
గరిమెళ్ళవ్యాసాలు