ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోచరము కాగలదు. కొన్ని సంధులను సముచ్చయరూపమగు మగాగమమును సందర్భానుసారముగా వారును విడుచుచునే యున్నారు ఇంతవరకు వారి తొల్లింటి కట్టుబాట్లను తెలిసియో, తెలియకయే కోరియే కోరకయే మీఱుచు వ్యావహారిక వాదమునకు సమీపముగా వచ్చుచు, సాపుగా చదువబడుచు వంద్యులగుచున్నారు.

   వ్యావహారిక భాషావాదులు పై వాని కొప్పుకొనుచునేయున్నరు. ఇట్లు వ్యావహారిక ప్రయోగములను చేయుటయే చాలునని వారు సంతసింపవలెను. గాని గ్రాంధిక ప్రయోగములను చేయనె రాదని పట్టుపట్టుట యవివేకము వాడుక భాషలో కూడ రెండు వాడుక భాషలున్నవేమో! సరీగా మనము మాటలాడే వాడుక భషనే గ్రాంధిక భాషాభిమానులు గ్రంధములలో వ్రాయరు వీటి కన్నింటికిని భేదములు బ్రహ్మాండ మంతవి కాకుండ దగ్గర దగ్గరవిగా ఉంటే ఛాలును. ఆందుచేత సుబోదక సుందర వ్యవహారిక శైలి పై మూడింటి లక్షణములతొను చెప్పలలరారవలెను ఇంతవరకు తెలుగులో వ్రాయబడిన గ్రంధములు చదివి, వ్యాకరణములు చూచి వ్యాసములు మొదలైనవి వ్రాయుట కలవాటుపడిన వారి శైలి నెట్టి వాదము తీసుకొని వచ్చి కాని ఆప్రమాణమని త్రోసివేయజాలము. అట్టివారిలోనుండి తప్పు ప్రయోగములుంటే తీసివేయవలెను. తప్పు ప్రయోగములు గ్రాంధిక వ్యావహారికములకు రెండింటికిని కూడినవి. తెలుగులో ఏదైనా వ్రాతాము. నలుగురు మనము వ్రాసినది చదవాలి అని అభిలషించే వారందరూ ఆ మాత్రము పునాది తొటి  అయినా రాకుంటే నోటికి వచ్చే ఆశ్లీలముల దగ్గర నుంచీ గ్రంధస్థములై లక్షణములను కోరవలసిన గతి పట్టుతుంది. వ్యావహారికవాదులైననూ నిరక్షరకుక్షుల యొక్కయు, గ్రంధములు చదువని వారి యొక్కయ్లు, రచన గాని, శైలి గాని అలవడని వారి యొక్కయు నోళ్ళకు వచ్చే ధోరణులు సర్వమూ గ్రంధస్థములు కావలెనని కోరదు గదా! అట్లుకోరినచో దానికి శిష్టత్వ మేర్పడదు. కంక వారి వాదనకీ అది భంగకరమగును. ఉభయభాషా సిద్దాంతులకును పాదుపైన ఒక శైలి యేర్పడవలెనన్న బ్రస్తుతపు ప్రసిద్ధ గ్రంధకర్తలని పేరుమోసిన లక్ష్మీనరసింహంగారు, వీరేశలింగం గారు, కవిరాజుగారు, పొనుగంటి వారు తిరుపతివారు మొదలగు