ఈ పుటను అచ్చుదిద్దలేదు

చున్నాను గాని ఇంతకన్న రసలాభప్రదమ్లగు వ్యవసాయములను ఉద్యోగములను చేయనేరక కాదని విజ్ఞానులు గ్రహించవలెను. "వ్యవసాయము చేసుకొనగూడదా? ఉదారుల ఉదారత నెన్నాళ్ళిట్లు పీడించుచు ఈ సొమరివృత్తికై గడంగెదవు. గాంధీంహాత్ముడు ఒడలు వంచి పనిచేయమన్నాడు? గాని యిట్లు పుస్తకముల పేరిట యాచించు కొనుమన్నాడా? ఈ కాలములో డబ్బు తెమ్మంటే గ్రంధము లెవ్వరికి గావలయు?" నని డెప్పిపొడవెడి మహనీయుల కిది సమాధానముగా చెప్పవలసివచ్చినందుకు క్షమింతురుగాక.

    "బ్రతుకు వారలు దున్ని బ్రతుకువారలు; పెఱులు
     బ్రతుకుదురు వారి నతుకుకొని"

  యని మాతిరువల్లువరు నాయనారే యీ గ్రంధము నందు వచించి యున్నారు.  నిజముగా నీపుడమిపై బ్రతుకవలసిన యేగ్యరీతిని బ్రతుకువారు వ్యవసాయవృత్తిచే బ్రతుకువారే. తక్కినవారిలో కొందరు వారికి సహాయకరములగు నితర వృత్తులలోను కొందరు వారిని గురించి లాభము గ్రహించెడి యితర వృత్తులలోను కొట్టుకొనుచు వారు పండించిన యన్నమే తినుచు ప్రత్యక్షముగ గాకున్న పరోక్షముగనైనను వారిపై నాధారముపడి బ్రతుకుచున్నవారే.  ఈ కారణము చేతనే ఆ కవీశ్వదుడే.

    "ఆణికృషీకుడులోక మంతకు అతడే ప్రోవ
      బూనె పెరవృత్తివారలను"

   అనగా "లోకమనెడి రధమునకు అతనే శీలవంటి వాడు. అతను తన్ను దాను పోషించుకొనుటయే కాక తన వృత్తికాని పర వృత్తికి బూనుకొనిన వారినందరిని గూడ బ్రోచుటకు కంకణము కట్తుకొనినాడు." అని వచించినాడు ఆట్టి సర్వొత్తమమగు వృత్తికి పోవుటకంటే నాకు శాశ్వతానందదాయకమగు సంగతి వేఱొక్కటి లేదు. అయినను, అట్టి వృత్తిలోనికి బోవుటకు గూద సర్కారువారి కృపాకటాక్షము వలన సగము వరకు ప్రారంభించిన యీ ధర్మోధ్యమమును విసర్జించినచో, నాకు క్షమాపణముండదనే విశ్వాసముతోనే కష్టములకును, నవమాసములకును డెప్పి పోటులకును గూడ వెనుకతగ్గక