ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాఖ్యాతలలోని తప్పుటభిప్రాయములను ఖండించి సరియైన వ్యాఖ్యానమును వ్రాసినాడు. అతని అభిప్రాయములను కాదను శక్తిగాని, యిట్టి వాఖ్యానముతో సరియగు వ్యాఖ్యానమును వ్రాయగల మహిమకాని తరువాతి వారి కెవరికిని లేకఫోవుటచేత, దీని తరువాత "తిరుక్కుఱళు" మీద క్రొత్త వ్యాఖ్యానములు పుట్టుట మానిచేసినవి. తిరువల్లువరు వారే తమ గ్రంధమును లోకులకు స్పష్టీకరించు నిమిత్తము పరిమేళజగరు యొక్క అవతారమునెత్తి ఈ వ్యాఖ్యాన మును వ్రాసి పరమపదించిరని వాడుక. అయినను వీరి వ్యాఖ్యానము పండిత వ్యాఖ్యానమై మూలముకంటెగూడ కష్టమగు భాషలో వ్రాయబడి పండిత జన సుబోధకమై మాత్రమే వెలయుచున్నది. శంకరభాష్యముల వలె ఇదియును పాఠము చెప్పించుకొననిదే వశీకరణమగున దెంత మాత్రమును కాదు.

    అయినను ఇట్టి వ్యాఖ్యాన మొకటి లేకున్నచో తిరుక్కుఱళు అగమ్యగోచరమై పూర్వాపర సందర్భశూన్యముగ నోటికి వచ్చిన వివేకములనెల్ల నెవడో యొకధీమంతుడువచ్చి కూసిపోయినట్లువలె, నుండకమానదు. అయినను వీరువచ్చి తిరుక్కుఱళు లోని అదికారమునకు నధికారమునకును సూత్రమునకు సూత్రమునకును గల సంబంధమును చూపుకొనిపోయి అది ప్రత్యేక మొక సంకల్పముతో వ్రాయబడిన మహాకావ్యమని నచ్చజేసినాడు. కుఱళులను ముత్యములలోను, కెంపులలోను, పచ్చలలోను, నంతర్గతమై వ్యాపించియున్న సూత్రమును మనకు చూపించి గ్రంధము నొక అద్భుతమగు నవలవలె ఫలించి సారస్యముగ గ్రహింపజేసిన పరిమేలజగదుగారి ప్రతిభయే ప్రతిభ. వ్యాఖ్యానము చెప్పవలసిన సంగతులు నేవినిగాని విడువక, విడచిపెట్టవలసినవి చాదస్తముగ విస్తరించి చెప్పక,సమగ్రముగను, సూక్ష్మముగను, మహిమబోధకమునై యలరారుచున్నది. నేను పఠించి నంతవరకు ఆంగ్లేయులలో నెచ్చటను నిట్టి వ్యాఖ్యాతలేడు. సమస్తభాషలలోని వ్యాఖ్యాతలకును నిది యాదర్శ ప్రాయమని రూఢిగ చెప్పవచ్చును.
   మొట్టమదట మూలమొక్కటియే నేను భాషాంతరీకరించి యుండియు, యిట్టి వ్యాఖ్యానము యొక్క సహాయము లేకున్నచో, అది అసమగ్రముగను అబోధకముగను, దుర్గ్రాహ్యముగను నుండునని యెంచి దానిని కూడ