ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాసయతితోనో అది కూడుకొనియుండును. మొదటిచరణము నాలుగు గణములతోను రెండవచరణము సుమారు రెండున్నర గణములతోను కూడి యుందును. తిరువల్లువారు ఈ గ్రంధము వ్రాసిన నాటి నుండియును ఆ చందస్సునకు కుఱళుచందము అనుపేరు రూఢియైనది. తెలుగులో గూడ నేనును అట్లే గ్రంధమునెల్ల వ్రాసి ఆ చందస్సుకు గూడ కుఱళు అను శబ్దమునే ఉపయోగించుచు వచ్చితిని యీ గ్రంధమును పఠించెడి వారికి విశదము కాగలదు. అది స్త్రీలు మొదలగు వారు పాడుకొనుటకును పండితులు చదువుకొనుటకును గూడ వీలుగనుండును. అఱవ కుఱళుకు సామీప్యం గల చంద మితకన్న వేరొక్కటి లేదు.

   చందోబద్దములగు చిన్న సూత్రములలో విస్తారముగు అర్ధములను గూర్చి సూక్ష్మముగ నుపన్యసించిన కావ్యమేది యనిన తిరుక్కుఱళళు అనియే చెప్పవలెను. ఆ మూడు పురుషార్ధములను గూర్చియు సకల సమాచారమును నిందు క్రమనియమము తప్పిపోకుండ చెప్పబడియున్నది గనుకను, ఇందులో లేని సమాచారము మఱియొకదానిలో లేదని చెప్పబడుటచేతను ఇది మహోత్కృష్ట గ్రంధమని నిర్ఫచించుటకెట్టి యాటంకమును లేదు. ఇట్టి గ్రంధమును వ్రాయుటచేతనే కవిదైవముగ భావింపబడి దైవత్తిరువల్లువరు అని పిలువబడుచున్నాడు. అట్టి గ్రంధములో నెట్టిదైన లోపముగాని చెప్పబడని సమాచారముగాని యున్నదని మన మెంచితిమేని అది మన బుద్దిలోపమును భాషాంతరకారుల లోపమును వ్యాఖ్యాతల లోపమును నగునుగాని కవిలోపము కాదు. కనుక గ్రంధము యొక్క లోపము గాని యెంత మాత్రమును కాదు. కనుక గ్రంధము యొక్క నిజమైన రహస్యమును మహత్వమును మనము గ్రహింపవలెననిన మహా మహుడగునొక వ్యాఖ్యాత సహాయము మనకత్యవసమై  యున్నది.
  ఇట్టి మహోత్కృష్టమగు గ్రంధము మీద ననేకము వ్యాఖ్యానములు అఱవ భాషలో వెలసినవి. అవియన్నియును బంద్ను పట్టును. అయినను పరిమేలజగరు అనునొక బ్రాహ్మణపండితోత్తముడు, సంస్కృత విద్వాంసుడు కాంచీపురవాస్తవ్యుడు క్రీ.వె. పదునొకండవ శతాబ్దములో దీనికొక చక్కని వ్యాఖ్యానము వ్రాసెను. ఇతను తనకు పూర్వము వ్రాసిననలుబదిమంది