ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనేవారు. త్రుంచి చదువుమనువారు, రాగము లేకుండా చదువుమనువారు, అంతా గద్యమునే వ్రాయ మనువారు.గద్యపద్య మిశ్రమము చేయుమనువారు, షేక్సిపియరు వలె ప్రధాన పాత్రములకూ ప్రధాన రంగములకును సర్వదా పద్యమున్ను, మామూలు పాత్రలకు మామూలు వాదుక భాషయును కావలె నను వారు పెక్కురు పెక్కు అభిప్రాయముల నిచ్చుచున్నారు. ఇంకను ప్రారంభములును సోదాలను మాత్రము చేయుచున్నారు. ఏవో కొన్ని సిద్ధాంతములు బయలుచేరునను ఆశకలుగుచున్నది. నవలలు, చిన్న కధల కంటె దీనిలో విశేషమేమనగా ఇందులో భాషాంతరీకరణములు కన్న స్వయంరచితము లెక్కువ యున్నవి. ఇతర భాషలలో నాటకముల పోకడ లెట్లున్నవో బాషాంతరీకరణము చేసి విద్వాంసులు తెలుపుచున్నారు. ప్రపంచము లోను హిందూ దేశములో నితర బాగములలోను బయలుదేరుచున్న ప్రస్తుత నాటక సిద్ధాంతములు తెలియబడుచున్నవి. ఎన్ని వివాదములు అభిప్రాయ భేదములు ఉన్నను నాటకరంగ ముత్సాహవంతముగను శుబసూచకముగను నున్నదనియే చెప్పవలెను.

దేశచరిత్రములు

  ఇక కావ్యములు కాని ఇతర గద్య గ్రంధములను గూర్చి మనమాలోచింప వచ్చును. ముందు విమర్శన గ్రంధములు వీటిలో ప్రకృతి వర్ణనలు కాని, ఉత్సాహొద్రేకములు పుట్టించుట కాని, సుందర పదతుందిలమగు శైలి కాని అవసరములు కావు. విమర్శకుని దృష్టి యెల్లయు తన చెంతనున్న అసంఖ్యాక ములగు పత్రముల నుండియు, అభిప్రాయముల నుండియు సత్యమైన దెద్దియో నిర్ణయించి బలవత్తరముగ రుజువు పరచి, అందుకు వ్యతిరిక్తములైన నన్నింటిని కాదని చెప్పి త్రోసిపుచ్చుట ఇట్టస్థి విమర్శనము ముఖ్యముగా దేశ చరిత్రమున కవసరమై యున్నది.  ఈ రంగములో మనకంటే ముందు పాశ్చాత్యులు ప్రవేశించి పత్రములు, శాసనములు, గ్రంధములు మొదలగునవి తిరగవేసి వారికి తోచిన సిద్ధాంతములను స్ధిరపరచి, నచ్చనివి త్రోసివేసి చరిత్రలు వ్రాసి, ప్రపంచము నకు ప్రచురించి మన దేశములొ పిల్లల చేతను పెద్దల చేతను పఠింపచేయుచున్నారు. ఇందు వాటి పరిశ్రమయే మనకు కొంత సహాయకరము కాగలదు. క్రొత్తక్రొత్త సంగతులు