పుట:Garimellavyasalu019809mbp.pdf/183

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తయారయినవి. నానాటికి ధన్యం పంట, బట్టల పంట, కుందలపంట, గిన్నెల పంట కంటే ఈ కేసుల పంట ఉత్పత్తి హెచ్చవుతున్నది.

  ఏ వకీలును చూచినా, జడ్జీని చూచినా ఉపన్యసకుని చూచినా అసత్యమును ఖండించి న్యాయమును నిలబెట్టాలని ప్రార్ధించి ఉపన్యాసాలిచ్చే వారే కాని, ఈ నేరమునరిగట్టటానికి యెవరికినీ దమ్ములేకున్నది.  ఈ పంట తగ్గితే వీరికవరికీ తినడానికి మెతులుండవు. త్రాగడానికి నీళ్ళుండవు. తిరగడానికి పరువుండదు. ఇవన్నీ ఇట్లు అమలు జరుగుతూ, వీటివల్ల వీరికి జీవనోపాది దర్జాలు జరుగుతూ, ఖండనోపన్యాసాలిస్తూ వుంటేకాని లోకమరమ్మత్తుకు అవకాశం యేర్పడదు మరమ్మత్తులోకం కోసం కాక లోకమే మరమ్మత్తు కోసం అనె వృత్తి యేర్పడడం వల్లనే నేటి న్యాయస్థానములు, విద్యాసంస్థలు, ప్రభుత్వోద్యాగాలు, ప్రభుత్వ విధానాలు, సినిమాలు మొదలగు విలాస సౌకర్యాలు కూడా ఇటువంటి  వక్రపదములను త్రొక్కుచున్నవి.
    నేటి పిన్నలే రేపటి పెద్దలు, నేటి విద్యార్ధులే రేపటి పౌరులు ఉద్యోగులు నాయకులు మొదలగువారు నేటి సంతతులే, రేపటి తరాలవారికి పితలు పితామహులు ప్రపితామహులు ఈ విదనాలవల్లనే మనము భవిష్యత్ శ్మశాన ప్రపంచమునకు పునాదు లను వేయుట, ఆత్మవిమర్శన చేసుకొనుట కవకాశము కలిగించుకొనవలదా? ఏ రోజు గొడవ ఆరోజు యెల్లాగో ఒకలాగా తీర్చుకొనడమే ప్రయోజత్వంగా భావించి కుళ్ళీకుతమరుతూ వుండడనికి మతృగర్భములను చేదించి మన మీ లోకమున నవతరించినది!  ఈ సమస్యల నెవరైనా తీవ్రంగా ఆలోచించుచున్నారా? ఆలోచిస్తే పరిష్కారం దొరకకపోవడం దుస్సాద్యమగుచున్నదా? లేక అట్టి ఆలోచన కూడా కపటము గానె జరుగుచున్నదా?
   ఇందులోఎవరి నేమి అనడానికి వీలులేకున్నది. అందరూ పట్టభద్రులు, ఉన్నతోగ్యోగులే. అందరూ ప్రధాన మంత్రులు ఉపప్రధానులే, కానివారు అట్లు రేపవుదామని యత్నింస్తున్నవారే. అందగూ వేదాంతపరులు. తత్వజ్ఙలు, ఉపన్యాసకులే ఆచణలకు, ఆలోచనలకు ఆలాపాలకూ ఎక్కడా మేనమామ మేనత్త సంతతుల పోలికలైనా లేకున్నవి.
గరిమెళ్ళ వ్యసాలు